మేడ మీద ఈ హీరో ఏం చేస్తున్నాడో తెలుసా!

Allari Naresh - Meda Mida Abbayi First look‘సుడిగాడు’ సినిమాతో అందుకున్న సక్సెస్ తర్వాత, ఆ రేంజ్ విజయం అంటే ఏంటో మరచిపోయిన అల్లరి నరేష్ తాజాగా “మేడ మీద అబ్బాయి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సమ్మర్ ముగిసిన తర్వాత విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. జూన్ 10వ తేదీన ‘ఫస్ట్ లుక్’ను విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే అల్లరి నరేష్ ఖరారు చేయగా, తాజాగా విడుదల చేసిన ప్రీ లుక్ లో మేడ మీద ఉన్న అబ్బాయి ఏం చేయబోతున్నాడో చెప్పకనే చెప్పారు.

మేడ మీద ఉంటూ టెలిస్కోప్ లో చూస్తున్న అల్లరి నరేష్ పోస్టర్ ఈ సినిమా యొక్క ‘థీమ్’ను రివీల్ చేసింది. గత కొంత కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ చూడని అల్లరోడు, మరి మేడ మీద చేసే చిత్ర విచిత్రమైన చేష్టలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారేమో చూడాలి. ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు షాన్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు అయిన జూన్ 10న ‘ఫస్ట్ లుక్’ విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అనుకునేరు… అదే రోజు అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ జన్మదినం కూడా!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories