‘Forbes India Cover‌’ పై అల్లు అర్జున్.. కంటెంట్‌పై కీలక కామెంట్స్

Allu Arjun featured on Forbes India Showstoppers cover

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు చేరింది. Forbes India తాజా ఇష్యూ కవర్ పేజీపై అల్లు అర్జున్ దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా రూపొందించిన ‘Showstoppers’ ఎడిషన్లో సినిమా, క్రీడలు, టెలివిజన్, సంగీతం, కళలు, ఫ్యాషన్ తదితర రంగాలకు చెందిన ప్రముఖులను ఫోకస్ చేశారు.

ఈ ఎడిషన్‌లో సెలబ్రిటీల బ్రాండ్ బిల్డింగ్ జర్నీ, వారు ఎదుర్కొన్న స్ట్రగుల్స్, తమకంటూ ప్రత్యేకమైన నిచ్‌ను ఎలా క్రియేట్ చేసుకున్నారనే విషయాలతో పాటు ఆసక్తికరమైన కథనాలు, అనుభవాలు ఉన్నాయి.

ADVERTISEMENT

కవర్ స్టార్‌గా నిలిచిన అల్లు అర్జున్.. ప్రస్తుతం సినిమాల పరిస్థితిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “బాలీవుడ్ అయినా, సౌత్ సినిమా అయినా.. ఏ ప్రాంతీయ సినిమా అయినా ప్రస్తుతం స్లంప్‌కు ఒక కారణం యావరేజ్ కంటెంట్. యావరేజ్ కంటెంట్ ఇప్పుడు వర్క్ అవ్వడం లేదు. మంచి కంటెంట్ ఎక్కడైనా వర్క్ అవుతుంది. కాబట్టి గొప్ప కంటెంట్ ఇవ్వడమే కీలకం” అని ఆయన అన్నారు.

Pushpa: The Rise, Pushpa 2: The Rule చిత్రాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్‌లో తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ఈ రెండు సినిమాలు కలిసి సుమారు రూ.2,200 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించాయి. దీంతో ఆయన దేశంలోని అత్యంత బ్యాంకబుల్ స్టార్స్‌లో ఒకరిగా నిలిచారు.

మరోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌లోనూ అల్లు అర్జున్‌కి భారీ డిమాండ్ ఉంది. ఇప్పటివరకు 25కి పైగా బ్రాండ్స్‌కు ఆయన అంబాసిడర్‌గా వ్యవహరించారు.

మొత్తానికి, Forbes India ‘Showstoppers’ కవర్‌పై అల్లు అర్జున్ ఫీచర్ కావడం ఆయన పాన్ ఇండియా స్టేచర్‌కు మరో బలమైన గుర్తింపనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories