‘బన్నీ’ కాస్త ‘కన్నీ’ ఎలా అయ్యాడు?

Allu Arjun Pawan kalyanమెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థాయికి కాస్త అటు ఇటుగా అభిమానులను ఆకట్టుకునే విధంగా, ఫ్యాన్స్ ను పడేసే విధంగా ప్రసంగించడంలో అల్లు అర్జున్ దిట్ట. నిజానికి ఈ అంశమే బన్నీకి మెగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. ఎలాంటి వేడుకపైన అయినా సరే మెగా వృక్షం నాటిన మెగాస్టార్ చిరంజీవి నుండి మెగా అభిమానులకు క్రేజీ హీరోగా మారిన పవన్ కళ్యాణ్ వరకు ప్రశంసలతో ముంచెత్తడం బహుశా ఎన్నో ఆడియో వేడుకలపై చూసే ఉంటాం.

సీన్ కట్ చేసి, విజయవాడలో జరిగిన ‘సరైనోడు’ సక్సెస్ వేడుకకు విచ్చేస్తే… బహుశా ఇక తానూ సాధించాల్సింది ఇంకేమి లేదనుకున్నారో, లేక తన రేంజ్ కంటే ఇంకా ఎక్కువ సాధించేసాను అని ఫీల్ అయ్యారో గానీ అల్లు వారి వారసుడు బన్నీ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. కెరీర్ ఎదగడానికి తొలినాళ్ళ నుండి పవన్ కళ్యాణ్ నామస్మరణ చేసిన ‘బన్నీ’ అసలు రంగు బయటపడి, ప్రస్తుతం ‘కన్నీ’గా మారిపోయాడని సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు.

ADVERTISEMENT

గతంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల వీడియోలను పోస్ట్ చేస్తూ… అప్పుడు బన్నీ అని… మరోపక్క ‘సరైనోడు’ వేడుకపై చేసిన వ్యాఖ్యలను రిపీట్ చేస్తూ ఇప్పుడు కన్నీ అని… ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పేరు పలకడానికే ‘చెప్పను బ్రదర్’ అన్న బన్నీ, మరికొన్నాళ్ళు ఆగితే చిరంజీవి పేరు పలకడానికి కూడా ఇలాగే వ్యాఖ్యానిస్తారు అంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ల వేదికగా మెగా అభిమానులు తమ ఆవేదనలను వెళ్ళగక్కుతున్నారు.

నిజానికి ‘సరైనోడు’ విడుదల తర్వాత వచ్చిన భిన్న స్పందనల మధ్య చిత్రం కమర్షియల్ గా సక్సెస్ ను అందుకోవడం బన్నీ ఈ రేంజ్ ప్రసంగానికి కారణమైందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల ట్విట్టర్లో కూడా ‘నా అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’ అని అభిమానులను వేరుచేసి మాట్లాడడం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అదీ గాక, ఇప్పుడు మ్యాటర్ ఏంటి 100 కోట్లేగా అని తేలిక చేసి మాట్లాడడం… ఒక్క పవన్ అభిమానులనే కాదు, ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

ఇంతకంటే భారీ సక్సెస్ లు అందుకున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోలు ఈ రకంగా ప్రవర్తించిన క్షణం ఒక్కటి కూడా లేదు. బహుశా అందుకే టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న హీరోలుగా మిగిలిపోయారేమో! సక్సెస్ ను గుండెల్లో పెట్టుకుంటే పర్వాలేదు గానీ, దాన్ని తలకెక్కించుకుంటే… జరిగే పర్యవసానాలు ఏమిటో… ఇప్పటికే చాలా మంది హీరోలు చాలా సందర్భాలలో చవిచూశారు. అంతదాకా ఎందుకు… అల్లు అర్జున్ సన్నిహితుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సక్సెస్ లతో మునిగి తేలినపుడు ఇలాంటి అనుభూతిని పొందిన వారే!

ADVERTISEMENT
Latest Stories