బన్నీ సినిమా అందుకే లేట్ అయిందట!

Allu Arjun -Naa Peru Surya, Naa Illu Indiaబన్నీతో త్రివిక్రమ్ సినిమా మొదలయ్యింది. అయితే ఈ సినిమా అటు బన్నీకి కానీ, ఇటు త్రివిక్రమ్ కి కానీ చాల అవసరం. మరో పక్క బన్నీ నా పేరు సూర్య తర్వాత చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇదిలా ఉంటే అసలు బన్నీ ఈ సినిమా కి అంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే తాజాగా బన్నీ చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా సమయంలో చాలా గొడవలే జరిగాయి అని, అయితే వాటిని సెటిల్ చేసే విషయంలో బన్నీనే ముందుకు వచ్చి సెటిల్ చేసాడు అని.

ADVERTISEMENT

పైగా ఈ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని అనుకున్నాడు అని, కానీ అది కాస్త తిరగబడి డిజాస్టర్ కావడంతో సొంత వారే నష్టపోయారు అని, వారికి అండగా నిలిచే క్రమంలోనే తాను తన తర్వాత సినిమాపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు అని తెలిసింది. అయితే ఈ సినిమా విషయంలో సొంత వారే నష్టపోవడంతో బన్నీ అంత కేర్ తీసుకున్నాడట.

ఏది ఏమైనా సినిమానే నమ్ముకుని ఉన్న వారికి హీరోలు ఇలానే అండగా నిలబడటం మంచి శుభ పరిణామమే అని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories