‘చెప్పను బ్రదర్’ అని బన్నీ చెప్పేసాడే!

Allu Arjun satires on Pawan Kalyan Fans‘సరైనోడు’ సక్సెస్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అన్న డైలాగ్ వేసిన అల్లు అర్జున్, అప్పటినుండి అదే మాట మీద ఉన్న విషయం తెలిసిందే. అయితే తాను ఏ సందర్భంలో ఆ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందో అని కూడా వివరణ ఇచ్చుకున్న బన్నీ మాటలకు పవర్ స్టార్ అభిమానులైతే సంతృప్తి చెందలేదన్న విషయం ‘డీజే’ టీజర్ ‘డిస్ లైక్స్’ నిరూపించింది. అయితే మరో పది రోజుల్లో సినిమా విడుదలకు ముస్తాబవుతున్న నేపధ్యంలో… జరిగిన ‘డీజే’ ఆడియో వేడుకలో బన్నీ నోట నుండి ఎట్టకేలకు ‘పవర్ స్టార్’ అన్న మాట వచ్చింది.

ఈ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడే సమయంలో పదే పదే ‘పవర్ స్టార్… పవర్ స్టార్…’ అంటూ అడ్డుపడిన అభిమాన వర్గాన్ని పూర్తిగా సంతృప్తి పరచడంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడు. ‘ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కట్టే కాలే వరకు మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే’ అంటూ హరీష్ చెప్పిన ఏమోషనల్ డైలాగ్ ఫ్యాన్స్ ను అలరించింది. దీంతో హరీష్ శంకర్ సుదీర్ఘ ప్రసంగం సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. అలాగే తన ప్రసంగానికి ముగింపు కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావనతో ముగియడంతో ఒక విధంగా శాంతించారు.

ADVERTISEMENT

అయితే కీలకమైన అల్లు అర్జున్ ప్రసంగానికి అభిమానులు ‘పవర్ స్టార్… పవర్ స్టార్…’ అంటూ నినాదాలు చేయడంతో… ‘ఇలా అరిచి సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ లు ఇద్దామని… అంటూ ఓ డైలాగ్ వేసారు బన్నీ. అయితే ఇప్పటివరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క అభిమానికి ధన్యవాదాలు చెప్పిన బన్నీ… ప్రత్యేకించి మెగా అభిమానులను ప్రస్తావిస్తూ… మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్… ఇలా ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నారు అని చెప్పారు. పవర్ స్టార్ మాట బన్నీ నోట నుండి రాగానే ఆడిటోరియం కాస్త రీ సౌండ్ వచ్చింది.

అయితే ఇక్కడ బన్నీ తనదైన శైలిలో కాస్త టిపికల్ గా మాట్లాడారు. మెగా అభిమానుల్లో ఒక్కొక్కరు ఒక్కో హీరోను అభిమానించవచ్చు కానీ, మొత్తంగా మీరంతా మెగా అభిమానులే… కాబట్టి మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు అని ప్రస్తావించారు. అలాగే తన సినిమాలను ఇతర హీరోల అభిమానులు, సామాన్య సినీ ప్రేక్షకులు కూడా చూస్తారని, వారందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ తెలిపారు అల్లు అర్జున్. సినిమా విడుదలకు ముందు రాద్ధాంతం ఎందుకు అనుకున్నారో ఏమో గానీ, ఈ వేడుకలో ఎలాంటి సంచలన వ్యాఖ్యలు నమోదు కాలేదు.

ADVERTISEMENT
Latest Stories