నేటితరం పిల్లలు ఏ రేంజ్ లో ఉన్నారో చెప్పడానికి మరో ఉదాహరణ అల్లు అర్జున్ ఇంట్లో జరిగింది. కొడుకు అయాన్ చేసిన పని చూసి షాక్ అవ్వడం తండ్రిగా అల్లు అర్జున్ వంతయ్యింది. ఇంతకీ జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏమిటంటే… తన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన తన ఐ ఫోన్ పాస్ వార్డ్ ను అల్లు అయాన్ ఓపెన్ చేసి, బన్నీ ట్విట్టర్ అకౌంట్ కు వెళ్లి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” పాట లింక్ ను షేర్ చేసాడు.
అయితే ఈ విషయం తెలియని బన్నీ కాసేపటి తర్వాత చూస్తే… అవాక్కయ్యాడు. తన భార్య వచ్చి ‘సర్ధార్’ పాటను పెట్టాడు కాబట్టి సరిపోయింది, ఇతర హీరోదైతే పరిస్థితి ఏం కానూ అని చెప్పడంతో షాక్ లో మునిగిన బన్నీ తన అనుభూతులన్నీ ట్విట్టర్ లో పంచుకున్నాడు. సాధారణంగా ఇలా పాటను షేర్ చేసుకోవాలంటే తనకు 10 నిముషాల సమయం పడుతుందని, కానీ, వాడు క్షణాల్లో ఈ పని చేసేసాడని, చిన్న పిల్లలు త్వరగా నేర్చుకుంటారని తెలిసినా, తనకు షాకిచ్చేలా ఇంత త్వరగా నేర్చుకుంటారని అనుకోలేదని… కొడుకు చేసిన పనికి ఇక నుండి మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నాడు బన్నీ.
Oh my god ! Shocking! My son was listening to songs in my phone iTunes a while ago. The next thing I see is Sardaar song in my Twitter acc.
— Allu Arjun (@alluarjun) March 29, 2016
It's impossible to do it. It took my 10 mins to figure out how he did it. He does'nt know anything on the phone. Just pureeee luck. Unreal.
— Allu Arjun (@alluarjun) March 29, 2016
Should me more careful from now on. I am still in shock ! Really shockeddd
— Allu Arjun (@alluarjun) March 29, 2016
My wife said : Thank god ! It's was a Pawan Kalyan song imagine if it was someone else's song
— Allu Arjun (@alluarjun) March 29, 2016



