అల్లు అయాన్… ఎవరిదీ ట్రైనింగ్..!

allu-arjun-son-aayanతాతను చూసి నేర్చుకున్నాడో లేక తండ్రిని చూసి అనుసరిస్తున్నాడో గానీ… ఆదివారం నాడు జరిగిన “దువ్వాడ జగన్నాధమ్” ఆడియో వేడుకలో హైలైట్ గా నిలిచాడు అల్లు వారి నెక్స్ట్ జనరేషన్ వారసుడు అల్లు అయాన్. సెలబ్రిటీ కొడుకుగా పెరిగితే ఈ రేంజ్ లో అవగాహన ఉంటుందా… అనే విధంగా స్టేజ్ పైకి రాగానే మెగా అభిమానులకు నమస్కారం చేస్తూ అందరినీ అబ్బూర పరిచాడు. బహుశా ఈ స్టిల్ ఇస్తాడన్న విషయం అల్లు అర్జున్ కు కూడా తెలియదేమో గానీ, అయాన్ ను చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేసాడు.

అలాగే మరో పక్కన తాత అల్లు అరవింద్ అయితే పట్టరాని సంతోషంలో మునిగిపోయాడని చెప్పవచ్చు. బహుశా తను నిర్మించిన సినిమాకు 100 కోట్లు లాభాలు వచ్చినా అల్లు అరవింద్ ఇంతలా నవ్వరేమో గానీ, మెగా అభిమానులకు మనవడు చేసిన అభివాదం చూసి మురిసిపోతూ చిరు దరహాసం ప్రదర్శిస్తున్నాడు. సహజంగా చిన్న పిల్లలు స్టేజ్ పైకి రావడానికే బెరుకుగా ఉంటారు. కానీ అయాన్ మాత్రం స్టేజ్ ఎక్కగానే అశేషమైన అభిమానులను చూసి నమస్కారం చేయడం… డీజే ఆడియో వేడుకకే హైలైట్ గా నిలిచింది.

ADVERTISEMENT

మరి అల్లు అయాన్ ఇచ్చిన స్టిల్ కు కుటుంబ సభ్యులే అవాక్కైతే, ఇక మాస్ మెగా అభిమానుల అనుభూతి ఎలా ఉంటుంది. ఆడిటోరియంను దద్దరిల్లేలా చేయరు… అదే జరిగింది. అయాన్ కు ఎవరు శిక్షణ ఇచ్చారో గానీ, “దువ్వాడ జగన్నాధమ్” వేడుకలో అల్లు అర్జున్ కు మించిన స్థాయిలో ఒకే ఒక్క స్టిల్ తో అభిమానుల మనసు దోచుకున్నాడు. ఈ వేడుకలో మొత్తం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొనగా, కొణిదెల కాంపౌండ్ వర్గం మాత్రం దూరంగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories