బన్నీ కోసం ఎగబడుతున్నారా?

alluarjun new movie updatesదర్శకుడు సుకుమార్ పాన్ ఇండియన్ మూవీగా రూపొందిస్తున్న పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 13 న విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ దేశం పై ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా అనిశ్చితం నెలకొంది. పరిస్థితులు సాధారణం అయ్యేవరకు విడుదల గురించి స్పష్టత ఉండదు.

ఇది ఇలా ఉండగా… అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ గురించి అనేక ఊహాగానాలు ఇప్పటినుండే మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్, ఎఆర్ మురుగదాస్ పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. తాజాగా బన్నీ తదుపరి చిత్రానికి మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నట్టు పుకార్లు వచ్చాయి.

ADVERTISEMENT

అదే సమయంలో అల్లు అర్జున్, వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణులతో కలిసి వారి ఇదివరకటి సినిమా ‘ఐకాన్‌’ ను పునరుద్ధరించడం గురించి దిల్ రాజు హిట్ ఇచ్చారు. ఫైనల్ గా ఈ దర్శకుల్లో ఎవరికి అసలు అవకాశం వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వదంతులు చూస్తుంటే బన్నీ కోసం ఎగబడుతున్నారా? అన్నట్టుగా ఉంది.

ఇది ఇలా ఉండగా… కోవిడ్ బారిన పడిన బన్నీ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. స్వల్ప లక్షణాలే ఉండటంతో ఇంటిలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు బన్నీ. ఇకపోతే… నయం అయ్యాకా కూడా బయట పరిస్థితి పూర్తిగా చక్కబడే దాకా కూడా పుష్ప షూటింగ్ మొదలు పెట్టకూడదని నిర్ణయించుకున్నాడట.

ADVERTISEMENT
Latest Stories