సినీ ప్రేమ జంట తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్, నటి అమలా పాల్ అధికారికంగా ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ మళ్లీ పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విడాకుల విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయ్ తండ్రి అళగప్పన్ తన కొడుక్కి మంచి సంబంధాలు చూస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.
ADVERTISEMENT
మరోపక్కన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అమలాపాల్ కు ఈ విషయం తెలియడంతో ఉద్వేగానికి గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. 2011లో ‘దైవ మరుగళ్’ చిత్రం షూటింగ్ సమయంలో అమలాపాల్, విజయ్ ల ప్రేమ వ్యవహారం మొదలుకాగా, 2014 జూన్ లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయేందుకు సిద్ధమై, 2016 లోనే అధికారికంగా ప్రకటించారు.
ADVERTISEMENT



