సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న అమ్మడు

Amala Paul Ties knot with Boy friendఅందం అభినయం కలిసి ఉన్న అమలా పాల్ తెలుగులో కొన్ని పెద్ద సినిమాలు చేసినా ఇక్కడ నిలదొక్కుకోలేకపోయింది. పాతికేళ్లు కూడా నిండకుండా 2014లో దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలా పాల్. అయితే 2017లో వారిద్దరూ మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే వీళ్లు వివాహ బంధం విచ్చిన్నం అయిపోయింది.

ADVERTISEMENT

ఆ తరువాత ఆమె మళ్ళీ సినిమాలలోకి కమ్ బ్యాక్ చేసి ఇక్కడ నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తుంది. తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్నా తెలుగులో ఇక రీ-ఎంటర్ కాలేదు. ఇప్పుడు అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుంది. ఎవరికీ చెప్పకుండా చాలా సైలెంట్‌గా తను ప్రేమించిన అబ్బాయితో మూడు ముళ్లు వేయించుకుంది.

అమలా పాల్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పేరు భవీందర్ సింగ్. ముంబై బేస్డ్ సింగర్.. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలా పాల్. వారిద్దరూ పెళ్లి చేసుకుని కూడా చాలా రోజులయ్యింది అని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా…. మొన్న ఆ మధ్య అమలా పాల్ విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్పతో తెలుగు సినిమాల్లోకి తిరిగి వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అవి నిజం కాలేదు. అయితే ఆమె లస్ట్ సిరీస్ అనే వెబ్ సిరీస్ తెలుగు రీమేక్ లో ఆమె నటించబోతుందని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories