అప్పుడు డోంట్ కేర్…ఇప్పుడు డోంట్ వర్రీ.?

Ambati Rambabu Arrest Sparks Political Reactions

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కూడా లెక్కచేయకుండా, తనకు నచ్చినట్టు ప్రవర్తిస్తున్న వైసీపీ నాయకులలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఒకరు. ఆయన మీడియా ముందుకొచ్చారు అంటే ప్రభుత్వం పై రాజకీయ విమర్శల కన్నా ప్రభుత్వ పెద్దల పై వ్యక్తిగత విమర్శలే ఎక్కువ.

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు పై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆయన పై కేసు నమోదయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అరెస్టుకు ముందు మీడియా ముందుకొచ్చిన అంబటి లోకేష్ రెడ్ బుక్ కి నా పెరటిలో కుక్క కూడా భయపడదు, ఎం పీక్కుంటారో పీక్కోండి అంటూ రెచ్చిపోయారు.

ADVERTISEMENT

అలాగే బాబు ని తిట్టిన బూతులు అనుకోకుండా తన నోటి నుంచి వచ్చాయని, అందు కోసం తనకు అరెస్టు చేస్తే చేసుకోవచ్చని, అరెస్టులకు తానూ భయపడను, డోంట్ కేర్ అంటూ తొడలుకొట్టారు. కట్ చేస్తే ఆ కేసులో అరెస్టయ్యి 24 గంటలు పూర్తవగానే నాకు బెయిలు కావలి అంటూ కోర్టులో పిటిషన్ తో ముందుకొచ్చారు.

ఇదిలా ఉంటే అంబటి పై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదుకాగా, గత ఏడాది నవంబర్ 12 న మెడికల్ కాలేజిల పీపీపీ విధానాలను వ్యతిరేకిస్తూ వైసీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి అక్కడున్న బారిగేట్లను తోసుకుంటూ పోలీస్ అధికారులతో దుర్భాషలాడుతూ వారి విధులకు ఆటంకం కలిగించారు.

ఈ విషయమై పట్టాభిపురం పీఎస్ లో అంబటి పై కేసు నమోదు కాగా ఆ కేసు విచారణకు తమకు అనుమతివ్వాలని, అంబటి పై గుంటూరు కోర్టులో పిటి వారంట్ దాఖలు గుంటూరు పోలీసులు. అయితే ఈ కేసు విచారణ చేపట్టిన స్పెషల్ జ్యూడిషియల్ కోర్ట్ అంబటికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.

అయితే అప్పుడు వైసీపీ రప్ప రప్ప రాజకీయాలకు ఆకర్షితులైన ఈ మాజీ మంత్రి అరెస్టులంటే డోంట్ కేర్ అంటూ రెచ్చిపోయారు, ఇప్పుడే అదే అంబటిని, అతని మీద పడుతున్న కేసులను చూసి డోంట్ వర్రీ, వచ్చేది మనమే మరో రెండేళ్లు కళ్ళుమూసుకో చాలు అంటూ వైసీపీ అంబటిని ఓదార్చలేమో..!

ADVERTISEMENT
Latest Stories