సంబరాల రాంబాబుకి ఓ ధర్మ సందేహం.. తీర్చగలరా ప్లీజ్!

Ambati Rambabu questions Pawan Kalyan over Sankranti dance in Pithapuram

వైసీపీ హయంలో మంత్రులు వారివారి శాఖలను బట్టి కాక వేరే విధంగా గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కోడిగుడ్డు మంత్రి, బూతుల మంత్రి, రేషన్ బియ్యం మంత్రి, జబర్దస్త్ మంత్రి, సంబరాల రాంబాబుగా చాలా పాపులర్ అయ్యారు.

రాష్ట్రాభివృద్ధి చేసినందుకో లేదా తమ శాఖలను అత్యంత సమర్ధంగా నిర్వహించినందుకో లేదా రాజకీయాలను శాశించినందుకో గుర్తింపు సంపాదించుకున్న వారిని చాలా మందిని చూశాము.

ADVERTISEMENT

కానీ రాజకీయ నాయకులుగా, మంత్రులుగా కంటే ఇలా వేరే విధంగా గుర్తింపు సంపాదించుకున్న ఘనత వీరికి మాత్రమే దక్కుతుందని చెప్పక తప్పదు.

వారి ఈ కీర్తి ప్రతిష్టలను ప్రజలు మరిచిపోయినా వారు మాత్రం అవి ‘భారత రత్న’ లేదా ‘పరమవీర చక్ర’ అవార్డులన్నట్లు మరిచిపోకుండా గుర్తుంచుకుంటున్నారు. సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి ప్రజలకు గుర్తు చేస్తున్నారు కూడా.

సంబరాల రాంబాబుగా ప్రసిద్ధి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఓ ధర్మ సందేహం కలిగింది. “సంక్రాంతిని నేను డాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా? మరి పవన్ కళ్యాణ్‌ వేస్తే?” అని అడుగుతున్నారు.

డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ మొన్న పిఠాపురంలో జరిగిన సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నప్పుడు గిరిజనులతో కలిసి డాన్స్ చేశారు. ఆ వీడియోని షేర్ చేస్తూ అంబటి రాంబాబు ఈ ప్రశ్న అడిగారు. ఆయన ధర్మసందేహం తీర్చాల్సిన బాధ్యత మనదే. ఎవరైనా తీర్చగలరా ప్లీజ్?

ADVERTISEMENT
Latest Stories