బాలయ్యా… ఇప్పుడే బాబుకి వెన్నుపోటు పొడిచేయ్: అంబటి

ambati-balakrishnaఇంతకాలం ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని వైసీపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వారే బాలయ్యను చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడవమని సలహా ఇస్తుండటం విస్మయం కలిగిస్తుంది. ఈ ఉచిత సలహా ఇచ్చింది మరెవరో కాదు… తన శాఖ గురించి ఎన్నడూ మాట్లాడని మంత్రి అంబటి రాంబాబు!

“బాలయ్య ఇప్పుడు మీరు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. శాసనసభలో మీసం తిప్పడం కాదు. ఇప్పుడే టిడిపిని మీ అధీనంలోకి తీసుకొని చూపించండి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. మీ అల్లుడు ఢిల్లీలో ఉన్నారు. కనుక టిడిపిని మీ అధీనంలోకి తీసుకోవడానికి ఇదే తగిన సమయం.

ADVERTISEMENT

తద్వారా క్లిష్ట సమయంలో మీ తండ్రిగారికి మీరు అండగా నిలబడలేదనే అపవాదును తొలగించుకోగలుగుతారు. మీకు దమ్ముంటే, నందమూరి పౌరుషం మీలో ఉంటే టిడిపిని మీ చేతుల్లోకి తీసుకొని ప్రార్టీని బ్రతికించుకోండి. లేకుంటే మీ పార్టీ సర్వనాశనం అయిపోవడం ఖాయం. నా సలహా నచ్చితే పాటించండి లేకునే మీ ఇష్టం,” అని అన్నారు.

మంత్రి అంబటి రాంబాబు తాను ఎప్పుడూ చాలా తెలివిగానే మాట్లాడుతున్నానని అనుకొంటూ ఇలా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటారు.

చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో నుంచి బయటకు రాకుండా చేసి టిడిపిని తుడిచిపెట్టేయాలని వైసీపి ప్రభుత్వమే ప్రయత్నిస్తోంది. దానిని కాపాడుకోమని అంబటి రాంబాబు ఉచిత సలహా ఇస్తున్నారు. టిడిపిని స్వాధీనం చేసుకోమని చెపుతూ ఆ పార్టీలో చిచ్చుపెట్టేందుకు కూడా అంబటి రాంబాబు ప్రయత్నిస్తున్నారు.

టిడిపి కూడా ఇదేవిదంగా విజయసాయి రెడ్డినో లేదా విజయమ్మనో లేదా వైఎస్ షర్మిలనో జగన్‌ చేతిలో నుంచి వైసీపిని స్వాధీనం చేసుకోమని సలహా ఇస్తే ఎలా ఉంటుంది?అంబటి రాంబాబు దానిని స్వాగతిస్తారా?

వైసీపీ నేతలకు రాజకీయ కుట్రలు చేయడానికి అలవాటు పడిపోయిన్నట్లు మంత్రి అంబటి రాంబాబు ఉచిత సలహాతో స్పష్టమవుతోంది.

జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నాడిఎంకెలో అందరి కంటే సీనియర్ నేత పళనిస్వామి తన చొక్కా జేబులో అందరికీ కనబడేలా ఆమె ఫోటో పెట్టుకొని తిరుగుతూ ఆమె దయ కోసం ప్రాకులాడేవారు. మంత్రి అంబటి రాంబాబు కూడా చొక్కా మీద జగన్‌ స్టిక్కర్ అంటించుకొని శాసనసభకు వస్తున్నారు.

మంత్రిగా సమర్ధత నిరూపించుకోవలసిన అంబటి రాంబాబు, తమ అధినేతను ప్రసన్నం చేసుకొని మెప్పు పొందితే చాలనుకొంటున్నారు. అటువంటి వ్యక్తి బాలకృష్ణకు ఇటువంటి దిక్కుమాలిన ఉచిత సలహా ఇస్తుండటం విడ్డూరంగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories