అమెరికాను అవాక్కు చేసిన నివేదిక! భారత్ కూడా బోణీ!

AMERICA RANK DROPPEDప్రపంచంలోని అత్యుత్తమ దేశం ఏది? ఈ ప్రశ్నకు ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తున్న ఏకైక సమాధానం అమెరికా. అయితే, ఈ సంవత్సరం ఆ హోదాను అమెరికా కోల్పోయింది. ఏకంగా మూడు స్థానాలు దిగజారి నాలుగవ స్థానానికి పడిపోయింది. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, వార్టన్ స్కూల్ అండ్ గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెంట్స్ సంస్థలు సంయుక్తంగా ప్రపంచ అత్యుత్తమ దేశాల జాబితాను తయారు చేసి దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా విడుదల చేశాయి.

అయితే ఈ జాబితా అందరినీ అవాక్కు చేసింది. జర్మనీ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలువగా, ఆపై కెనడా, బ్రిటన్, అమెరికా, స్వీడన్ లు ఉత్తమదేశాలుగా నిలిచాయి. మొత్తం 36 దేశాలకు చెందిన 16,248 మంది నుంచి 24 విభాగాల్లో సమాధానాలు తీసుకుని 60 దేశాలకు ఈ ర్యాంకులను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 4,500 మంది వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు.

ADVERTISEMENT

కేటగిరీల వారీగా చూస్తే, శక్తిమంతమైన దేశంగా అమెరికా తొలి స్థానంలో నిలువగా, ఉత్తమ పౌరులు, క్రీడలు, చిన్నారుల పెంపకం విషయంలో స్వీడన్, సాహస కృత్యాల్లో బ్రెజిల్, వ్యాపారాన్ని ప్రారంభించేందుకు లక్సెంబర్గ్, సంస్కృతిలో ఫ్రాన్స్, ఔత్సాహికత్వంలో జర్మనీ, మెరుగైన జీవనంలో కెనడా, సంస్కృతి, సంప్రదాయాల విషయంలో ఇటలీ, అప్ కమింగ్ ఎకానమీగా భారత్ తొలి స్థానాల్లో నిలిచాయి. ఏదొక విభాగంలో ఇండియాకు ఓ స్థానం దక్కడం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories