అమెరికా బలం, బలహీనత: యుద్ధాలు చేయడమే?

US war politics

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ రష్యా-ఉక్రెయిన్, భారత్‌-పాక్‌, ఇజ్రాయెల్-పాలస్తీన తదితర దేశాల మద్య యుద్ధాలు నిలిపివేసేందుకు ఎంతగానో కృషి చేశానని చెప్పుకుంటారు.

యుద్ధాల వలన అమాయకులైన లక్షల మంది చనిపోతుంటారు కనుక శాంతి స్థాపనకు తన వంతు కృషి చేస్తున్నానన్నారు. యుద్ధాలు ఆపేస్తూ మానవాళిని కాపాడుతున్నందుకు నోబుల్ శాంతి బహుమతి కూడా ఆశించారు. కానీ దక్కలేదు.

ADVERTISEMENT

తాను అమెరికా అధ్యక్షుడైతే జస్ట్ పది రోజులలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపించేస్తానని ట్రాంప్ గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఆయన ఏడాది పాలన పూర్తయినా ఆ యుద్ధం ఆగలేదు. కానీ ఆ పేరుతో భారత్‌ చెయ్యి మెలిపెట్టి వేలకోట్ల వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు చేయించుకున్నారు.

ట్రంప్‌ దృష్టి వెనిజులా తర్వాత ఇప్పుడు ఇరాన్ మీద పడింది. డజన్ల కొద్దీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇరాన్ చుట్టూ మొహరింపజేశారు.

అమెరికా బలమూ, బలహీనత యుద్ధాలు చేస్తుండటమే. ఒక్కో యుద్ధానికి ఒక్కో కుంటిసాకు ఉంటుంది. కనుక ఇరాన్‌పై యుద్ధానికి కారణం ఏమిటంటే అణ్వాయుధాలు తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సాధనాలు కలిగి ఉండటమే.

అమెరికా పెరట్లో గుట్టలుగుట్టలు అణ్వాయుధాలు పెట్టుకొని, ఇతర దేశాలు మాత్రం వాటికి దూరంగా ఉండాలని అమెరికా హుకుం జారీ చేయడం, వినలేదనే సాకుతో దాడికి సిద్ధం అవుతుండటం ట్రంప్‌ దురహంకారానికి పరాకాష్ట!

ఉద్దరిణిలో పోస్తేనే నీళ్ళు తీర్థం అవుతుందన్నట్లు, ఇరాన్‌తో అమెరికా శాంతి చర్చలు కూడా యుద్ధం చేయడానికి ఓ సాకు కోసమే. కనుక ఇరాన్ చుట్టూ మొహరించి ఉన్న యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు నేడో రేపో బాంబుల వర్షం కురిపించడం ఖాయమే.

అమెరికా దురాగతాన్ని ఏ దేశమూ అడ్డుకోలేదు. కానీ పవిత్ర రంజాన్ మాసం మొదలైనప్పుడు అమెరికా చేస్తున్న ఈ దురాగతంతో యావత్ ప్రపంచంలో ముస్లిం దేశాలు, ముస్లింలు కోపం, బాధ, ఆవేశం, నిస్సహాయతతో రగిలిపోతారని వేరే చెప్పక్కరలేదు.

ట్రంప్‌ తాను చాలా దూకుడుగా వ్యవహరిస్తూ యావత్ ప్రపంచదేశాలను ఒంటి చేత్తో కట్టడి చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ తన తన దుందుడుకుతనంతో యావత్ ప్రపంచదేశాలను అమెరికాకు శత్రువులుగా మార్చేస్తున్నారు.

అమెరికా ప్రవర్తన ఇలా ఉన్నందునే గతంలో ట్విన్ టవర్స్ మీద దాడి జరిగింది. అయినా అమెరికా ధోరణిలో మార్పు రాలేదు. కనుక ఏదో రోజు ఇలాంటి యుద్ధాలకి అమెరికా మళ్ళీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories