టీజర్ టాక్ – శతమానం భవతి 2.0!

Ammammagarillu Movie Teaserవేగేశ్న సతీష్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన “శతమానం భవతి” సినిమా గుర్తుందా? సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను మళ్ళీ ఓ సారి “అమ్మమ్మగారిల్లు” టీజర్ గుర్తు చేస్తుంది. ‘శతమానం పార్ట్ 2’లా కనపడుతోన్న ఈ టీజర్ ను ఆదివారం నాడు విడుదల చేసారు.

‘ఛలో’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న నాగశౌర్య ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసాడు. ‘శతమానం భవతి’ ఛాయలు పుష్కలంగా కనపడుతున్నప్పటికీ, ఫ్యామిలీ రిలేషన్స్ లో ఉండే మాధుర్యం కారణంగా ఈ టీజర్ ఆహ్లాదకరమైన అనుభూతిని పంచుతుంది.

ADVERTISEMENT

‘శతమానం భవతి’లో ప్రకాష్ రాజ్ ని హీరో శర్వానంద్ ఫాలో అయితే, ఈ ‘అమ్మమ్మ గారిల్లు’లో అమ్మమ్మను హీరో నాగశౌర్య ఫాలో అయినట్లు కనపడుతోంది. ఒక్క సీన్స్ లోనే కాదు, టైటిల్ కార్డ్స్ కూడా అదే రకంగా ఉండడం కాకతాళీయం అనుకోవాలా! సుందర్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ‘ఓయ్’ ఫేం షామిలి రీ ఎంట్రీ ఇస్తోంది.

ADVERTISEMENT
Latest Stories