ట్రైలర్ టాక్ – అనగనగా ఓ రొటీన్ స్టోరీ!

Anaganaga O Premakatha Trailerటాలీవుడ్ లోకి కొత్తగా అడుగు పెడుతున్న దర్శకులు, హీరోలు సరికొత్త కధలను చూపిస్తూ, తమకంటూ ఓ మార్క్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం సేఫ్ జోనర్ ను ఎంచుకుంటున్నారు. ఆ కోవలో రాబోతున్న సినిమానే “అనగనగా ఓ ప్రేమకధ.” హీరో గోపీచంద్ విడుదల చేసిన ధియేటిరికల్ ఈ సినిమా కధపై స్పష్టతను ఇచ్చింది.

ADVERTISEMENT

[m9ad]

అమ్మాయిల వెంటపడుతూ ఉల్లాసంగా గడిపే ఓ యువకుడు… అతన్ని మనసారా ప్రేమించే ఓ యువతీ… ఆ తర్వాత హీరో రియలైజ్ అవ్వడం… ఇవన్నీ ఎన్నో సినిమాలలో చూసిన కధే. అయితే దీనిని తెరపై ఎంత అందంగా ప్రజెంట్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు అనే దానిపైనే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. కట్ చేసిన ట్రైలర్ మాత్రం ఓ పదేళ్ళ ముందర సినిమాలా కనపడుతోంది.

అశ్విన్ జే విరాజ్ కధానాయకుడిగా పరిచయం అవుతుండగా, ‘లవర్స్’ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటించిన రిద్ధి కుమార్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతాప్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు అంజన్ సంగీతం అందిస్తుండగా, కే.ఏల్.ఎన్.రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ధియేటిరికల్ ట్రైలర్ లో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.

ADVERTISEMENT
Latest Stories