శృంగార పురుషుడ్ని కాదు… సింగార పురుషుడ్ని..!

Anam Vivekananda Reddy, Anam Vivekananda Reddy Getup, Congress EX MLA Anam Vivekananda Reddy Getup, Nellore EX MLA Anam Vivekananda Reddy Getup, TDP Anam Vivekananda Reddy Getupరాజకీయాల్లో ఆనం వివేకానందరెడ్డి శైలి వేరు. పొలిటికల్ వర్గాల్లో ఎవరూ చేయని విధంగా వింత పోకడలు చేసే ఆనం, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను, తన వ్యక్తిగత శైలి గురించి చెప్పుకొచ్చారు ఆనం. “నాకు ఇష్టమొచ్చినట్లుగా మాత్రమే నేనుంటాను, ఇష్టమైన డ్రెస్సులు వేసుకుంటాను. ఒకరు చెప్పినట్లు నేను చేయను, కొత్త గెటప్ ల్లో తాను కనిపించడం వెనుక ఎలాంటి కారణం ఉండదని, అది తన స్పెషాలిటీ మాత్రమేనని, ఆ సమయానికి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటానని” తన శైలి గురించి చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

“నా బొడ్లో తాళాలు పెట్టుకుంటా, కిర్రుమనే చెప్పులు వేస్తా, నాకు జుట్టు ఉంది కాబట్టి నా ఇష్టమైన రంగు వేస్తా, నా ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి, ఒకరు చెబితే నేను చెడిపోలేదు.. మరొకరు చెబితే బాగుపడలేదు” అని తన వేషధారణపై వివరణ ఇచ్చారు. ‘నా మనవళ్లు కూడా నన్ను వివేకా అనే పిలుస్తున్నారు. నా మిత్రులందరూ కూడా నన్ను వివేకా అనే పిలుస్తారు. నా బిడ్డలు కూడా వివేకా అని పిలిస్తే ఐ ఫీల్ మోర్ హ్యాపీ… నా వయసును గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, పెరుగుతున్న వయసు గురించి నేను ఆలోచించను, ఏజ్, గేజ్ కాదు.. ఏజైనా గేజైనా దాంట్లో ఇమిడిపోవడానికి తాను ప్రయత్నం చేస్తానని, అవి సమస్య కాదని’ అన్నారు.

‘రాజకీయాల్లో ఎంత కఠినంగా ఉంటానో, వ్యక్తిగతంగా అంత సున్నితమైన మనస్తత్వం తనదని, ఈ సున్నితత్వం మహిళలకే ఉంటుంది తప్ప, వేరొకరికి ఉండదని, రెండు రకాల ఆలోచనలు చేసేవాడిని స్ప్లిట్ మైండెండ్ అంటారని సైకాలజీలో చెబుతారని, తనకు స్ప్లిట్ మైండ్ నెస్ ఉందని, దానికి తాను ఒప్పుకుంటానని, ఆడవాళ్లను ఆకర్షించాల్సిన అవసరం తనకు లేదని, వాళ్లే తనను గెలిపించారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. శృంగారాల జోలికి పోను గానీ, సింగారాలు మాత్రం తాను చేస్తానని అన్నారు ఈ మాజీ కాంగ్రెస్ నేత.

తమ జిల్లాలో ఎంత మంది నాయకుల్లో శృంగార పురుషులు ఉన్నారో తనకైతే తెలియదని, తాను మాత్రం సింగార పురుషుడని… తనకు మిగిలిపోయిన కొన్ని కోరికలు ఉన్నాయని.., ఆ కోరికలేమిటంటే… జనంతో ఉండటం, వారితో తన జీవితం కొనసాగించడమేనని, ‘ఇట్స్ మై లాస్ట్ డిజైర్’ అని తన ఆకాంక్షను వెలిబుచ్చారు. నెల్లూరులో ఉంటే తాను రోజూ సినిమాకు వెళతానని, అయితే సినిమాకు మాత్రం ఒక్కడినే వెళతానని, తనతో పాటు నలుగురిని తీసుకువెళితే సినిమా చూడానివ్వకుండా ఏవో కబుర్లు చెబుతూ సినిమా చూడనివ్వరని, అందుకే, ఒంటరిగా వెళతానని అన్నారు ఈ ప్రస్తుత టీడీపీ నేత.

ADVERTISEMENT
Latest Stories