చిన్న దేవరకొండ మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నాడా?

 anand deverakonda-upcoming movie updatesవిజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసానితో తెరంగేట్రం చేశారు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో సెకండ్ మూవీతో ఎలగైన్స్ సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. దొరసాని విడుదలకు ముందే ఆయన తన రెండో సినిమా ఒకే చేశారు. ఆ సినిమా ద్వారా వినోద్ అనే యువకుడు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సినిమాను శమంతకమణి – పైసా వసూల్ వంటి సినిమాలను నిర్మించిన వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ప్రాజెక్ట్ ని తెరకెక్కించనున్నారు. తన అన్న విజయ్ దేవరకొండకు బాగా కలిసి వచ్చిన ఆంధ్ర అబ్బాయి పాత్రలో ఆనంద్ కనిపించబోతున్నాడు. సినిమా కథ మొత్తం ఆంధ్ర లొకేషన్స్ లోనే కొనసాగుతుందట. మంచి మెస్సేజ్ తో పాటు సినిమాలో కామెడీ, ఎమోషన్ ఎపిసోడ్స్ కూడా గట్టిగానే ఉంటాయని టాక్ వస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. ఆనంద్ మొదటి సినిమాలాగే ఇది కూడా ఛాలెంజింగ్ పాత్ర అని తెలుస్తుంది.

ADVERTISEMENT

అయితే ఆనంద్ దేవరకొండ తొలి సినిమాకు భిన్నంగా ఇది పూర్తి మోడర్న్‌గా ఉంటుందట. ఈ సినిమాతోనైనా ఆనంద్ హిట్ కొడతాడేమో చూడాలి. మొదటి సినిమా ప్లాప్ కావడంతో రెండో చిత్రానికి ఒక పెద్ద దర్శకుడితో పని చెయ్యాలి అని చాలా మంది ఆనంద్ కు చెప్పినా ఆయన వినోద్ చెప్పిన కథను నమ్మి ఈ సినిమాను ఒకే చేశారు. ఈ సినిమాలో ని హీరోయిన్ ను, ఇతర పాత్రధారులను ఫైనల్ చేసే పనిలో ఉంది చిత్రబృందం.

ADVERTISEMENT
Latest Stories