ట్రైలర్ టాక్ – హిట్ కళలు పుష్కలంగా ఉన్నాయ్!

Anando Brahma Theatrical Trailer‘ఫస్ట్ లుక్’తోనే ప్రేక్షకులను పడేసిన “ఆనందో బ్రహ్మా” చిత్ర యూనిట్, అదే ఊపును తాజాగా విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్ వరకు విజయవంతంగా కొనసాగిస్తోంది. ఓ పాపకు తాత దెయ్యం కధ చెప్పడంతో ప్రారంభమైన ఈ ట్రైలర్ లో ప్రతి షాట్ కూడా వీక్షకులను ఆకట్టుకునే విధంగా కట్ చేసారు. అలాగే క్లైమాక్స్ లో ‘మీ తాత చనిపోయి మూడేళ్ళయ్యింది’ అన్న డైలాగ్ తో ట్రైలర్ ను మరింత రక్తి కట్టించారు.

రేయి చీకటి ఉన్న వ్యక్తిగా ‘వెన్నెల కిషోర్’ కామెడీ విన్యాసాలు, వర్మను అనుకరించే షకలక శంకర్ డైలాగ్స్ కు తోడు ప్రధాన పాత్రలో నటించిన శ్రీనివాస్ రెడ్డి కామెడీ టైమింగ్, తాప్సీ హావభావాలు… ఇలా పాత్రలన్నీ బాగా పండినట్లుగా ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అలాగే సాంకేతిక విభాగంలో అనిష్ తరుణ్ కుమార్ ఫోటోగ్రఫీ, కే అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా అన్నీ అత్యున్నత స్థాయిలోనే ఉన్నాయి.

ADVERTISEMENT

ఫైనల్ గా చెప్పాలంటే… హిట్టు కళలు పుష్కలంగా కనపడుతున్న ట్రైలర్ గా “ఆనందో బ్రహ్మా”ను అభివర్ణించవచ్చు. దీంతో చిత్ర విడుదల తేదీ అయిన ఆగష్టు 18 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూడవచ్చు. ‘భలే మంచి రోజు’ బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. గతంలో ‘విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ, పాఠశాల’ సినిమాలకు దర్శకత్వం వహించారు మహి.

ADVERTISEMENT
Latest Stories