‘బ్రహ్మోత్సవం’పై విష ప్రచారం ఆపండి!

Maheshbabu - brahmostavamశుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలు ఏర్పడ్డ ప్రిన్స్ ‘బ్రహ్మోత్సవం’పై సోషల్ మీడియాలో ఒక వర్గం ఎక్కుపెట్టింది. ఒక హీరో సినిమాలను తొక్కేయాలని ఇతర హీరోల అభిమానులు పూనుకోవడం అనే “విష సంస్కృతి” నానాటికి తెలుగు ప్రేక్షకుల్లో పెరిగిపోతున్న నేపధ్యంలో… బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న రవి ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై ఇచ్చిన కామెంట్స్ కు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందనలు వస్తున్నాయి.

ADVERTISEMENT

“భారీ పెట్టుబడి, కుటుంబ అనుబంధాలు, కష్టపడే పనితనం, దాదాపు 800 మంది శ్రమ, ఎన్నో సంవత్సరాల కృషి, ఎన్నో అడ్డంకులుతో ఒక్క సినిమా తీసి జనాలని వినోదపరచాలనే ఒకే ఒక్క మంచి అభిప్రాయంతో వస్తే… మీరు ‘బొక్కలాగే ఉంది, నా జీవితంలో మూడు గంటల సమయం వృధా చేసుకున్నాను, మా వాడితో పెట్టుకుంటే ఇలానే ఉంటది, ఇది పెద్ద రాడ్’ అనే స్టేట్మెంట్స్ ఈజీగా ఇస్తున్నారు. “ప్రేమించకపోయినా ఓకే గానీ, చంపేయకండి… ఆలోచించండి” అంటూ రవి చేసిన కామెంట్స్ నెటిజన్లలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసాయి.

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమా పేరు పెట్టకపోయినా, దీని గురించే రవి చెప్పడాన్న విషయం అందరికీ అర్ధమైంది. అయితే ఇది ఒక్క ‘బ్రహ్మోత్సవం’ సినిమాకే పరిమితం కాదు. బహుశా మున్ముందు వచ్చే సినిమాలకు కూడా ఇలాంటి “వ్యతిరేక ప్రచారం ఆపండి” అంటూ ఒక సందేశాన్ని ఇచ్చిన తీరును మెచ్చుకుని తీరాలి. నిజానికి ఈ విష సంస్కృతి ఇప్పటిది కాదు. అయితే దీనికి ఎక్కడో ఒక చోట చరమగీతం పాడితే గానీ, తెలుగు సినిమా బతికి బట్టకట్టదు.

అన్ని సినిమాలు అందరికీ నచ్చవు… అలాగే ‘బ్రహ్మోత్సవం’ కూడా నచ్చకపోవచ్చు… కానీ, రవి వ్యక్తపరుస్తున్న అభిప్రాయం ఏమిటంటే… నచ్చకపోతే వదిలేయండి… పని కట్టుకుని దాని మీద వ్యతిరేక ప్రచారం చేయవద్దు… అని..! ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు నేడు ఆ హీరో అభిమానులు చేసారని, తర్వాత మరొక హీరో అభిమానులు పుణికిపుచ్చుకుంటే… అంతిమంగా తెలుగు సినీ పరిశ్రమ మనుగడకే నష్టం అన్న అభిప్రాయాన్ని పరోక్షంగా రవి మాటల్లో వ్యక్తపరిచారు. చదువుకున్న విజ్ఞులందరినీ ఆలోచించమని మాత్రమే రవి కోరారు… పాటించమని కాదు.! అంతే కదా… ఎవరి విజ్ఞత వారికి ఉండాలి కానీ, ఒకళ్ళు చెప్తే అలవర్చుకుంటారా…!

ADVERTISEMENT
Latest Stories