కారణాలు ఏవైనా గానీ, హైదరాబాద్ నుండి పాలన సాగించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరన్న విషయం తెలిసిందే. 2016, జూన్ 2వ తేదీ నుండి విజయవాడ వేదికగానే పరిపాలన చేయాలని సిఎం సంకల్పించారు. ఈ దిశగా ఉద్యోగస్తులకు ఇప్పటికే దిశనిర్దేశాలు జారీ చేయగా, తాజాగా అన్ని ప్రభుత్వ శాఖలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు అందించింది.
2016, జూన్ 1వ తేదీ లోపున అన్ని కార్యాలయాలు విజయవాడకు తరలి రావాలని, అలాగే ఆయా శాఖలకు కావాల్సిన ఏర్పాట్లు వారే చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవై కృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఉత్తర్వులు జారీ చేసారు. ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతోనే ఈ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తోంది.
ADVERTISEMENT





