ఇంత కరువులోనూ మరో రుణమాఫీకి ఏపీ సిద్ధం!

chandrababu call to bussiness peopleఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చవిచూస్తున్న ఆర్ధిక కష్టాలు సామాన్యమైనవి కాదు. రాష్ట్ర విభజన నుండి ఇదే రకమైన పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, “రుణమాఫీ”ల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మూడు విడతల వారీగా ఇప్పటికే 24,000 కోట్లు రైతు రుణమాఫీకి ఖర్చు చేయగా, డ్వాక్రా రుణమాఫీల కోసం దాదాపు 3 వేల కోట్లు కేటాయించారు. అలాగే నవ్యాంధ్ర రాజధానికి ఎంపిక చేసిన గ్రామాల రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేసారు.

ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్న ఏపీ సర్కార్, తాజాగా చేనేత కార్మికులకు చెంది రుణాలపై దృష్టి కేంద్రీకరించింది. దాదాపు 111 కోట్ల చేనేత, మరమగ్గాల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం, ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా హ్యండ్లూమ్స్, టెక్స్ టైల్స్ కమీషనర్ ను ఆదేశించింది.

వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలకు ఒక లక్ష రూపాయల వరకు మరియు గ్రూపులకు గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య కమిటీ సూచించిన సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రకటనతో చేనేత, మరమగ్గాల కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రం ఉన్న పరిస్తితులలో ఈ రుణమాఫీని ప్రకటించడాన్ని… రైతుల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories