‘చద్దన్నం’ లా తెలంగాణ ‘ఆవకాయ’ లా ఆంధ్రా రాజకీయాలు..!

ap-telangana-elections-results-counting-2024

ఎన్నికల ప్రచారం మొదలుకుని పోలింగ్ వరకు ఒక స్థాయిలో జరిగిన ఏపీ రాజకీయాలు ఇప్పుడు పోలింగ్ ముగిసిన తరువాత నుంచి కౌంటింగ్ వరకు మరోస్థాయిని చేరుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతల పై విమర్శలు చేయడం, ఆరోపణలు గుప్పించడం సర్వ సాధారణంగా జరిగే ప్రక్రియే. అయితే పోలింగ్ ముగిసిన తరువాత కూడా ఏపీలో రాజకీయం ఆవకాయ…బిర్యానీ లా వేడెక్కుతూనే ఉంది.

ADVERTISEMENT

అయితే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికలలో కనిపించినంత వాడి వేడి ప్రచారాలు కానీ, ఎవరు గెలుస్తారు? ఎవరు ఒడతారు? అంటూ పనికట్టుకుని వేచి చూసే ధోరణిలో కానీ అక్కడ ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొనలేదు. ఏపీలో అధికార పీఠం పై ఎవరి జెండా ఎగురుతుంది అనే దగ్గర నుండి కొన్ని ప్రతిష్టాత్మక ప్రాంతాలలో ఎవరు ఎంత మెజారిటీతో నెగ్గుతారు అనేదాని మీద కూడా చాల పెద్ద మొత్తంలోనే బెట్టింగులు కొనసాగుతున్నాయి.

అయితే తెలంగాణలో కనీసం ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారు అనేదాని మీద కానీ, ఎవరు తగ్గుతారు? ఎవరు నెగ్గుతారు? అనే అంశం మీద కానీ ఎవరు చర్చ కూడా జరపడం లేదు. సోషల్ మీడియా మొదలుకుని, మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు అందరి ద్రుష్టి ఏపీ రాజకీయాల మీద వాటి ఫలితాల మీదే. అలాగే ఆ తరువాత రాష్ట్రంలో జరగబోయే పరిణామాల మీదే చర్చ జరుగుతుంది.

వైసీపీ గెలిస్తే కూటమి పార్టీల పరిస్థితి ఏంటో…అంటూ వైసీపీ మద్దతుదారులు, కూటమి పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ లెక్క తేల్చడం కాయం అంటూ కూటమి మద్దతుదారులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఎవరి అంచనాలలో వారు ఉంటున్నారు. అటు తెలంగాణ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికలతోనే కారును షెడ్ కు పంపిన బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడప్పుడే రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. అలాగే బిఆర్ఎస్ కారు స్థానాన్ని మెలిమెల్లిగా కమలం అల్లుకుంటుంది.

అసెంబ్లీ ఎన్నికలలో ప్రాణం పెట్టి పోరాడి విజయాన్ని అందుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం అంత దూకుడుగా వెళ్ళలేదనే చెప్పాలి. ఇలా ఎటు చూసిన తెలంగాణ రాజకీయాలు చప్పగా చద్దన్నం లా చల్లగా ఉంటూ మెలోడీ సాంగ్ తరహాలో సాగిపోతుంటే, ఆంధ్రా రాజకీయాలు గుంటూరు మిర్చి లా హాట్ హాట్ గా ఉంటూ ఐటమ్ సాంగ్ మాదిరి స్పైస్ ను క్రియేట్ చూస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories