రిస్కులో అనిల్ రావిపూడి క్రెడిబిలిటీ

anil-ravipudi-faces-credibility-test

రైటర్ గా, డైరెక్టర్ గా అనిల్ రావిపూడిని హిట్ మెషీన్ అంటూ ఉంటారు ఇండస్ట్రీ పెద్దలు. వరుసబెట్టి సంక్రాంతి హిట్లు కొట్టడమే కాక, ప్రతి సినిమాతో 100 కోట్ల రూపాయలపైన కలెక్షన్లు కొల్లగొట్టడమే అందుకు కారణం.

అయితే.. దర్శకుడిగా అనిల్ కి ఉన్న క్రెడిబిలిటీకి ఈమధ్యనే చిన్న డెంట్ పడింది. శివాజీ నిర్మించి నటించిన “సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని” సినిమాని మొదట ఓటీటీ రిలీజ్ అనుకొని తర్వాత థియేట్రికల్ రిలీజ్ చేసారు.

ADVERTISEMENT

ఈటీవీ విన్ సంస్థలో ఇదివరకు కూడా “లిటిల్ హార్ట్స్” అలా ఓటీటీకి అనుకోని థియేట్రికల్ రిలీజ్ చేసిన సినిమానే. అలాగే.. సాంప్రదాయిని సినిమాని కూడా విడుదల చేస్తున్నారులే అనుకున్నారు జనాలు.

అయితే.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసి, అది క్యాన్సిల్ చేసి మరీ థియేటర్లకి వచ్చింది ఆ సినిమా. అందుకు ముఖ్య కారణంగా అనిల్ రావిపూడి పేరు వినిపించింది. అనిల్ సినిమా చూసి ఇది థియేటర్లో ఆడే సినిమా అని శివాజీ & ఈటీవీ విన్ సంస్థకి ఇచ్చిన నమ్మకంతోనే సాంప్రదాయిని చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు.

కట్ చేస్తే.. ప్రీమియర్ షోల నుండే జనాల రిజెక్షన్ ఎదుర్కొని, థియేట్రికల్ గా డిజాస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు ఈవారం థియేటర్లలో విడుదలవుతున్న మరో చిత్రం “లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ”కి కూడా అనిల్ రావిపూడి జడ్జ్ మెంట్ ని టికెట్ సెల్లింగ్ ఫ్యాక్టర్ గా చూపిస్తున్నారు.

నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో LIK దర్శకుడు విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ “అనిల్ రావిపూడి సినిమా చూసి నచ్చిందని చెప్పారు, ఆయన మాట మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది” అన్నారు. అనీల్ రావిపూడి కూడా గంటన్నర ఫుటేజ్ చూసా, అదీ రీ-రికార్డింగ్ లేకుండానే నవ్వు ఆగలేదన్నాడు.

నిజానికి LIK సినిమాకి తమిళనాడులోనే పెద్దగా పాజిటివ్ బజ్ లేదు, సినిమా కూడా పలుమార్లు పోస్ట్ పోన్ అయ్యి ఎట్టకేలకి ఈవారం విడుదలవుతుంది. మరి ఈ సినిమా అనిల్ రావిపూడి క్రెడిబులిటీని నిలబెడుతుందా లేక రిస్కులో పెడుతుందా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories