ఒక సెన్సేషన్ అయితే గ్యారెంటీ – అనిల్ రావిపూడి!

Anil Ravipudi Nandamuri Balakrishna new movie‘అన్ స్టాపబుల్’తో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ వెనుక ఇపుడు సినిమా డైరెక్టర్లు పరిగెడుతున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లిన బాలయ్య, త్వరలో ‘పటాస్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్ 3’ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడితో జతకట్టబోతున్నారు.

ఈ సినిమా జులై, ఆగష్టులలో ప్రారంభం అవుతుందని చెప్పిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సినిమా ఒక సెన్సేషన్ అయితే గ్యారెంటీగా అవుతుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఇప్పటివరకు బాలకృష్ణ గారిని కలిసింది తక్కువే అయినా, ఒక హీరోగా తనపై పూర్తి నమ్మకాన్ని ఉంచారని, అలా హీరో తనను బ్లైండ్ గా నమ్మితే తనకు పూనకం వచ్చినట్లు చెలరేగిపోతానని అనిల్ చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

తాను బాలయ్య రూట్ లోకి వెళ్లడం – బాలయ్య తన రూట్ లోకి రావడం కాదని, ఇద్దరం కలిసి ఒక రూట్ లోకి వచ్చి సినిమాను తీస్తామని అన్నారు. బాలకృష్ణ గారు ఒక అన్ స్టాపబుల్, ఖచ్చితంగా సినిమా కూడా అలాగే ఉంటుందని, ఎవరూ ఊహించినట్లుగా అయితే ఈ సినిమా ఉండదని తెలిపారు ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.

ఒక దర్శకుడిగా వరుసగా 5 కమర్షియల్ సక్సెస్ లను అందించిన అనిల్, ఆరవ చిత్రంగా ఈ సమ్మర్ లో “ఎఫ్ 3″ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కమర్షియల్ కోణంలో ఆహ్లాదకరమైన కామెడీని అందించడంలో సిద్దహస్తుడిగా పేరుగాంచిన అనిల్ రావిపూడి – బాలయ్య కాంబో ఊహించడానికే క్రేజీగా మారడంతో, ఈ ప్రాజెక్ట్ అప్పుడే టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.

ADVERTISEMENT
Latest Stories