‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదల అవ్వగానే పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్‌లో నటిస్తాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తాడు అని, ఆ తర్వాత ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అనీష ఆంబ్రోస్ హీరోయిన్‌గా నటించనుంది అంటూ వార్తలు వచ్చాయి. కాన్ని ఏవో కారణాల వల్ల ఆ సినిమా నుండి ఆ ఇద్దరిని కూడా తప్పించడం జరిగింది. పవన్ సినిమాపై అనీష ఆంబ్రోస్ చాలా ఆశలు పెట్టుకుంది. కాని పవన్ నుండి తిరష్కరణకు గురి అవ్వడంతో అనీషకు మరే సినిమాలో కూడా ఛాన్స్ రాలేదు. అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అనీషకు ఇప్పటికి సందీప్ కిషన్ ‘123’ రూపంలో వచ్చింది.
తమిళంలో సక్సెస్ అయిన ‘నేరం’ చిత్రాన్ని సందీప్ కిషన్ రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే. ‘123’ అనే వైవిధ్యభరిత టైటిల్‌తో రూపొందబోతున్న ఈ సినిమాలో మొదట రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేయాలని భావించారు. కాని ఆమె బిజీగా ఉండటం వల్ల తమిళ హీరోయిన్ కీర్తితో సంప్రదింపులు జరిపారు. కీర్తి కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో చివరకు తెలుగు అమ్మాయి అయిన అనీష ఆంబ్రోస్‌తో ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చేయించాలని దర్శకుడు ఆనంద్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభించి వచ్చే సంవత్సరం వేసవిలో ఈ సినిమాను విడుదల చేస్తాం అంటున్నారు. ఈ సినిమాతో అనీష హీరోయిన్‌గా సక్సెస్‌ను సాధిస్తుందో చూడాలి.





