అయ్యో రఘురామ… మళ్ళీ మరో కేసులో బుక్కయ్యావా?

another-case-on-Raghu-Rama-Krishna-Rajuఅధికార పార్టీలో ఎంత చోటామోటా నేతైనా ఆ లెవిలే వేరు. యావత్ ప్రపంచం తమ గుప్పెట్లోనే ఉన్నట్లు భావిస్తుంటారు. కానీ పాపం.. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నం.

ఆయన సిఎం జగన్మోహన్ రెడ్డి వైఖరి, ఆయన ప్రభుత్వం పనిచేసే విధానం నచ్చక పార్టీకి దూరం అయ్యారు. అప్పటి నుంచి ఆయన సిఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం, కోర్టు కేసులు వేస్తుండటంతో జగన్ ప్రభుత్వం కూడా ఆయన పట్ల అదేవిదంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. దాంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి.

ADVERTISEMENT

ఇప్పుడు ఆయన తన నియోజకవర్గంలోనే కాదు ఏపీలోనే అడుగుపెట్టలేక హైదరాబాద్‌ లేదా ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నారు. ఏపీని జగన్ పరిపాలిస్తున్నంత కాలం తాను ఏపీలో కాలుపెట్టనీయరేమో అని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు కూడా.

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఆయనపై రెండు కేసులు పెట్టింది. ఇవాళ్ళ ఏపీ ఇంటలిజన్స్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్‌కే ఫరూక్ బాషా ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామకృష్ణ రాజు, ఆయన కుమారుడు భరత్, ఆయన పీఏ శాస్త్రి, ఆయన భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్, సీఆర్పీఎఫ్ ఏఎస్ఐలపై కేసు నమోదు చేశారు.

ప్రధాని పర్యటన సందర్భంగా రఘురామకృష్ణ రాజు ఇంటికి సుమారు కిలోమీటరు దూరంలో డ్యూటీలో ఉన్న తనను ఆయన భద్రతా సిబ్బంది బలవంతంగా ఈడ్చుకొంటూ తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారని ఎస్‌కే ఫరూక్ బాషా ఫిర్యాదు చేశాడు.

అయితే అతను తమ ఇంట్లోకి రహస్యంగా జొరబడి మొబైల్ ఫోన్‌తో చిత్రీకరిస్తుంటే పట్టుకొని పోలీసులకు అప్పగించామని రఘురామకృష్ణ రాజు సిబ్బంది చెపుతున్నారు.

తన ఇంటి వద్ద ఏపీ ఇంటలిజన్స్ పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారని వారిపై తక్షణం చర్య తీసుకోవాలని కోరుతూ రఘురామకృష్ణ రఘురామకృష్ణ రాజు తెలంగాణ ముఖ్యమంత్రికి ఓ లేఖ కూడా వ్రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన కూడా తాను గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని, తన ప్రాణాలకు ప్రమాదం ఉందమ్ని ఆందోళన చెందుతున్నానని కనుక తక్షణం తగు చర్యలు తీసుకోవాలని రఘురామ లేఖలో కోరారు.

అయితే ఆయన ఫిర్యాదు చేస్తే పట్టించుకోని గచ్చిబౌలి పోలీసులు, ఓ పోలీస్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయగానే రఘురామకృష్ణ రాజుపై కేసు నమోదు చేయడం గమనిస్తే అక్కడ కూడా ఆయనకు పరిస్థితులు అనుకూలంగా లేవని అర్దమవుతోంది. కనుక ఇక ఢిల్లీకి మకాం మార్చాలేమో?

ADVERTISEMENT
Latest Stories