
స్వీటీ అనుష్క బాహుబలి 2 తరువాత చాలా పెద్ద బ్రేక్ తీసుకుంది. బరువు తగ్గడానికి చాలా శ్రేమించిందని సమాచారం. ఇది ఇలా ఉండగా ఆమె మెగాస్టార్ చిరంజీవి సై రా చిత్రంలో ఒక్క చిన్న పాత్ర చేశారట. ఆ చిత్రం షూటింగ్ సందర్భంగా అనుష్క గాయపడిందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఆమె సినిమాలో నటిస్తున్నట్టు బయటకు పొక్కకూడదని సైరా నిర్మాతలు కూడా ఆమె గాయంపై స్పష్టత ఇవ్వలేదు. దీనితో ఆమె అభిమానులలో ఆందోళన మొదలయ్యింది.
దీనిపై అనుష్క స్పందించింది. “నేను ధృఢంగా, ఆరోగ్యంగా ఉన్నాను. సీటెల్‌లో జరుగుతున్న షూటింగులో హ్యాపీగా పాల్గొంటున్నాను. లవ్ యూ ఆల్” అంటూ తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు. ఈ అప్ డేట్ తో స్వీటీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మా స్వీటీ గురించి ఇటువంటి వార్తలు వ్యాపింపచేస్తుంది ఎవరు అంటూ నొచ్చుకుంటున్నారు. అనుష్క ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆమె తాజా ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సీటెల్‌లో జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ మూవీకి హేమంత్ మధుకర్ దర్శకుడిగా పనిచేస్తున్నారు. మాధవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె నటించిన చివరి చిత్రం ‘భాగమతి’ 2018 మొదట్లో విడుదలైంది. ప్రస్తుతం చేస్తున్న ‘సైలెన్స్’ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అనుష్క చిన్న పాత్రలో కనిపించే సైరా చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు.



