అనుష్క… వాటిపై ఓ లుక్కేయాలేమో..!

Anushka Shetty vanity van seized in pollachi“బాహుబలి 2”లో దేవసేనగా కనిపించిన ‘స్వీటీ’ అనుష్క, ప్రస్తుతం మరో ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ లో పాలు పంచుకుంటోంది. “భాగమతి” పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళనాడులోని పొల్లాచ్చి తదితర ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ షూటింగ్ స్పాట్ లోకి ఉన్న వాహనాన్ని ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకున్నారన్న వార్త మీడియా వర్గాల ద్వారా వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్ కు – ఆర్టీవో అధికారులకు సంబంధం ఏంటి? అంటే… ఇక్కడ అనుష్క కోసం ఏర్పాటు చేసిన కార్వాన్ తెరపైకి వచ్చింది.

ADVERTISEMENT

‘అందాల బొమ్మ’ అనుష్క కోసం చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఓ కార్వాన్ ను ఏర్పాటు చేయగా, సదరు వ్యాన్ కు సంబంధించి ఉండాల్సిన పత్రాలు ఏవీ లేవని తెలుసుకున్న రవాణాశాఖ అధికారులు, షూటింగ్ స్పాట్ లో ఉన్న కార్వాన్ ను స్వాధీనం చేసుకున్నారు. పొల్లాచ్చి ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు, దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇదంతా జరుగుతున్నపుడు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అనుష్క కూడా స్పాట్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వాహనాలకు రవాణాశాఖ అధికారులు పెద్దగా పట్టించుకోరన్న టాక్ ఉన్న నేపధ్యంలో… ఏకంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఖచ్చితమైన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అయినా కోట్లు ఖర్చులు పెట్టి షూటింగ్ నిర్వహించే నిర్మాణ సంస్థకు, ఒక వాహనానికి కావాల్సిన పత్రాలను సమకూర్చుకోలేదా? ఇలాంటి సంఘటనలు అంతకుముందు చోటు చేసుకోకపోవడంతో, అనుష్క కూడా ఈ దిశగా ఆలోచనలు చేయలేదేమో గానీ, మున్ముందు వాహన పత్రాలపై కూడా హీరోహీరోయిన్లు ఓ లుక్కేయాలేమో..!

ADVERTISEMENT
Latest Stories