సెలబ్రిటీలను డీ కొడుతోన్న సామాన్యుడు!

Anushka Shrama and Virat Kohli in legal troubleఇటీవల ముంబయిలో రోడ్డుపై ఖరీదైన కారులో వెళుతూ అర్హన్‌ అనే వ్యక్తి. చెత్తను నడి రోడ్డుపైనే పడేయడంతో, ఆ విషయాన్ని గమనించిన బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ… వెంటనే ఆ యువకుడిని ప్రశ్నిస్తూ క్లాస్‌ పీకిన విషయం తెలిసిందే. అంతేగాక ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె భర్త, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ఎవరైనా చెత్త పడేయడం చూసినప్పుడు మీరూ ఇలానే చేయండని సూచించాడు.

ADVERTISEMENT

అయితే తాజాగా వారిద్దరికి వ్యతిరేకంగా అర్హన్‌ లీగల్‌ నోటీసు పంపాడు. తాను రోడ్డుపై పడేసిన చెత్త కంటే అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉందని, సెలబ్రిటీ అయివుండి రోడ్డున పోయే వ్యక్తిలాగా కేకలు వేసిందని, ఇది మర్యాద అనిపించుకోదని ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన అర్హన్‌… తనను అలా విమర్శించడమే కాకుండా, తన వీడియోను పోస్ట్ చేయడం పట్ల చట్టపరమైన నోటీసులు ఈ ఇద్దరు సెలబ్రిటీలకు పంపినట్లు సమాచారం.

తాను రోడ్డుపై చెత్త వేసినందుకు ఇప్పటికే అర్హన్‌ క్షమాపణలు చెప్పాడు. కానీ ఆయనతో అలా ప్రవర్తించి, వీడియో పోస్ట్ చేసినందుకు గానూ ఇప్పటివరకు అనుష్క, కోహ్లీ క్షమాపణలు చెప్పలేదు. తాజాగా ఆయన పంపిన ఈ నోటీసులకు వారు స్పందించాల్సి ఉంది. తాజా పరిణామంతో షాక్ కు గురి కావడం ఖచ్చితంగా కోహ్లి, అనుష్కల వంతవుతోంది. సామాన్యులు – సెలబ్రిటీల యుద్ధంలో చివరికి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలని చాలామంది వెయిటింగ్!

ADVERTISEMENT
Latest Stories