చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగర నిర్మాణ పనులు చేపట్టి కొంతవరకు పూర్తి చేశారు. కానీ ఆయనపై, కమ్మ సామాజికవర్గంపై అసూయా ద్వేషాలతో జగన్మోహన్ రెడ్డి వేలకోట్లు విలువైన దానిని నిర్ధాక్షిణ్యంగా పాడుబెట్టేశారు.
ఆ తర్వాత విశాఖ రాజధాని అంటూ ఋషికొండని చెక్కేసి రూ.500 కోట్ల ప్రజాధనంతో తన కోసం విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. రాష్ట్రంలో ఎప్పటికీ తానే అధికారంలో ఉంటాననే ధీమాతోనే అంత ప్రజాధనం ఖర్చు చేసి తన విలాస జీవితానికి తగిన్నట్లుగా వైట్ హౌస్‌కి తీసిపోని విదంగా వాటిని నిర్మించుకున్నారు. ఆ తర్వాత కధ తెలిసిందే.
Also Read – అప్పుడు తగ్గించారు…ఇప్పుడు తగ్గేదెలా అంటున్నారా.?
రెసుమారు రెండు నెలల క్రితం టిడిపి నేత గంటా శ్రీనివాసరావు తదితరులు వెళ్ళి వాటిని పరిశీలించి వచ్చారు. వాటిలో అమర్చిన ప్రతీ వస్తువు దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత ఖరీదైనవి కావడం వలన అవి ప్రభుత్వ భవనాలుగా వినియోగించుకోవడానికి లేదా పర్యాటకశాఖ వినియోగించుకోవడానికి కూడా పనికి రావని తేల్చి చెప్పారు.
కనుక వందల కోట్లు పెట్టి నిర్మించిన ఆ భవనాలను ఏవిదంగా సద్వినియోగం చేసుకోవాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా పరిశీలించిన తర్వాత నిర్ణయిస్తారని చెప్పారు.
Also Read – రేషన్ బియ్యం పట్టుబడితే ఎదురు దాడి.. భలే ఉందే!
ఇటీవల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖలో పర్యటించినప్పుడు వాటిని ప్రభుత్వం ఏవిదంగా వినియోగించుకుంటుందని ప్రశ్నించగా, అన్ని వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించడమే తప్పని, వాటిని ఏవిదంగా ఉపయోగించుకోవాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. జగన్ అవినీతి సామ్రాజ్యానికి సూచికగా వాటిలో మ్యూజియం ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో? అని వ్యంగ్యంగా అన్నారు.
మంత్రి వ్యాఖ్యలపై వైసీపి నేతలు భగ్గు మంటున్నారు. మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి అంత అమూల్యమైన భవనాలు నిర్మించి అప్పగిస్తే, టిడిపి కూటమి ప్రభుత్వానికి వాటిని వినియోగించుకోవడం చాతకావడం లేదని విమర్శిస్తున్నారు.
Also Read – రేషన్ బియ్యం దొంగలు గప్‌చిప్?
జగన్ మీద ద్వేషంతో అంత విలువైన భవనాలను పాడుపెట్టేయాలని టిడిపి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అలా చేస్తే రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కలుగుతుందని వాదించారు.
ఋషికొండపై భవనాల విషయంలో ఈవిదంగా వాదిస్తున్న వైసీపి నేతలు, వేలకోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన అమరావతిని తమ అధినేత అసూయాద్వేషాలతోనే పాడుపెట్టారు కదా? ఆవిదంగా చేయడం తప్పని, ఖజానాకు నష్టమని జగన్‌కు చెప్పడానికి వైసీపి నేతలెవరికీ ధైర్యం చాలలేదు. ఇది మరిచిపోయి ఋషికొండ ప్యాలస్ గురించి తెగ బాధ పడిపోతున్నారు.
అయినా సిఎం చంద్రబాబు నాయుడు ఏమీ జగన్మోహన్ రెడ్డిలా విధ్వంసకర రాజకీయ నాయకుడు కారు. ఒకవేళ అయ్యుంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే వాటిని కూల్పించేసేవారు కదా? కానీ అలా చేయలేదు. పోలీసులను మోహరించి వాటికి రక్షణ కల్పించారు.
సిఎం చంద్రబాబు నాయుడు కేవలం పని ఒత్తిడి వలననే ఋషికొండ ప్యాలస్ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతోంది తప్ప మరోటి కాదని అందరికీ తెలుసు వైసీపి నేతలకు తప్ప. అందుకే ఈ అవాకులు చవాకులు.