స్థానిక ఎన్నికలు చాల హాట్ గురు….

AP Local Polls: TDP, YSRCP Clashes and Alliance Seat Dispute

ఏపీలో అధికార కూటమి, వైసీపీ ల మధ్య మొదలైన స్థానిక ఎన్నికల సమరం ఆరంభంలోనే అగ్గి రాజేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో నామినేషన్ ప్రక్రియలో భాగంగా టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య దాడులు జరిగాయి. అయితే ఇందులో ఏ పార్టీ వారు ఆ పార్టీ నేతలకు మద్దతు పలుకుతూ ఎదుటువారి పై నిందలు వేస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా స్థానిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఇదే రకమైన ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆశించినా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు సహకరించడం లేదనే చెప్పాలి.

ADVERTISEMENT

సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసిపోవు అనేలా ఒకరకంగా చెప్పాలంటే అంతకు మించి అనేలా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాలు రాజకీయ దాడులకు కేంద్ర బింధువుగా మారిపోతున్నాయి. పుంగనూరు మొదలుకుని తిరుపతి, రాయచోటి, తిరుపతి, ధర్మవరం…ఇలా అనేక ప్రాంతాలలో కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య వాతావరణం రణరంగంగా మారిపోయింది.

దీనితో ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవాడ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. నామినేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితులను తమ దృష్టికి తెచ్చేందుకే ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అంటూ ప్రజలు, పార్టీ అభ్యర్థులు, అధికారులు ఎవరైనా తమకు సమస్య పై ఫిర్యాదు చేయవచ్చని టోల్ ఫి నంబర్లు ప్రకటించారు.

ఇక ఇటు పొత్తులో భాగంగా టీడీపీ – జనసేన అధినేతల మధ్య ముగిసిన సీట్ల పంచాయితీ, ఇరు పార్టీల లీడర్, క్యాడర్ వద్ద మొదలయ్యింది. తాము పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నామని, పొత్తు పేరుతో తమ రాజకీయ భవిష్యత్ ని అయోమయంలోకి నెట్టడం భావ్యం కాదంటూ కొందరు టీడీపీ తమ్ముళ్లు తమ ఆవేదన ను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు.

అలాగే ఇటు జనసైనికులు సైతం పార్టీకోసం ఇన్నాళ్లకు జెండా మోసిన వారిని పక్కన పెట్టి ఇన్స్టెంట్ నాయకులుగా వలసదారులకు అవకాశం కల్పించడం ఏంటంటూ అధినేత మీద తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇలా స్థానిక ఎన్నికలు అటు అధికార పార్టీకి ఇటు విపక్ష పార్టీకి కత్తిమీద సాము మాదిరే తయారయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే స్థానిక ఎన్నికలు చాల హాట్ గురు అనక తప్పదేమో…!

ADVERTISEMENT
Latest Stories