పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభంజనం ఉంటుందా?

AP Panchayat Elections and alliance prospects

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు మొదటి దశలో 3,240 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. కనుక మిగిలిన ఎన్నికలతో పోలిస్తే ఇవి ‘ఇన్‌స్టాంట్ కాఫీ’వంటివని చెప్పవచ్చు.

ఈ నెల 29న రెండో దశ, డిసెంబర్‌ 2న మూడో దశ పంచాయతీ ఎన్నికలు (పోలింగ్) జరుగుతాయి. ఈ మూడు దశల్లో అవసరమైతే మర్నాడే రీపోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.

ADVERTISEMENT

గ్రామ స్థాయిలో జరిగే ఈ ఎన్నికలు పార్టీలు, జెండాలకు అతీతమని చెప్పుకుంటునప్పటికీ, గ్రామస్థాయి వరకు రాజకీయ పార్టీల ప్రభావం వ్యాపించి ఉంది.

కనుక అభ్యర్థులు ఏదో ఓ పార్టీకి చెందినవారే అనేది అందరికీ తెలిసిన రహస్యం. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లదే కీలకపాత్ర. అందువల్ల ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అన్ని పార్టీలకు చాలా కీలకమే.

ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలే ఘనవిజయం సాధించాయి. కనుక ఈ ఎన్నికల ఫలితాలు కూడా తదనుగుణంగానే ఉండవచ్చు.

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ వాదించింది. కనుక దాని ఆరోపణలు దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఈసారి మరింత భారీగా పోలీసులను మొహరించి, బాడీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచింది. ఈ ఎన్నికల్లో అదనపు భద్రత కల్పిస్తున్నా వైసీపీ మళ్ళీ పాత పాటే పాడుతోంది.

ఈ అదనపు మోహరింపులు, డ్రోన్ కెమెరాలతో నిఘా వగైరాలన్నీ కూడా వైసీపీకి చెందినవారు ఎవరూ పోలింగ్ బూత్‌ల్లో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు, లోపల టీడీపి గూండాలు రిగ్గింగ్ చేసుకునేందుకే అని వాదిస్తోంది.

పోలీసులతో భద్రత కల్పించాలంటూ కోర్టులను ఆశ్రయించే వైసీపీయే, పోలింగ్ బూత్‌ల వద్ద అంత మంది పోలీసులను మోహరించడాన్ని తప్పు పడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకీ వైసీపీ ఏం కోరుకుంటోందో?

ADVERTISEMENT
Latest Stories