అనగనగనగా… అరవింద సమేత..!

Aravindha Sametha Anaganaganaga Video Songవిడుదలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేనటువంటి త్రివిక్రమ్ – జూనియర్ ఎన్టీఆర్ “అరవింద సమేత” సినిమా ప్రమోషన్స్ లో వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే. దీనికి ఎన్ని కారణాలున్నా… యంగ్ టైగర్ అభిమానులు మాత్రం ‘అరవింద సమేత’ అప్ డేట్స్ కోసం వేయికళ్ళతో వేచిచూస్తున్నారన్నది మాత్రం వాస్తవం. అందుకే చిత్ర యూనిట్ కూడా వారికి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ADVERTISEMENT

[m9ad]

ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల అయిదు నిముషాలకు ‘అనగనగనగా’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేస్తున్నట్లుగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ స్పష్టం చేసింది. ఎస్.ఎస్.థమన్ నుండి రాబోతున్న ఈ లిరిక్ వీడియో రెగ్యులర్ గా వచ్చేది కాదని, చాలా డిఫరెంట్ గా ఉంటుందని, దీనిని ఎవరూ మిస్ కావద్దంటూ పీఆర్వోల ప్రమోషన్ కూడా మరో పక్కన జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడం ఫ్యాన్స్ కు పండగే కదా!

ADVERTISEMENT
Latest Stories