
“అరవింద సమేత” ఆల్బమ్ లో ఉన్న నాలుగు పాటలలో మూడు సిట్యూయేషనల్ సాంగ్స్ కాగా, ‘రెడ్డి ఇక్కడ సూడు’ అన్న ఒకే ఒక్క పాట మాత్రం యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు కావలసినట్లుగా వినపడింది. దీంతో ఈ పాట విజువల్ గా ఎలా ఉంటుందో, ఎన్టీఆర్ స్టెప్పులు ఎలా ఉంటాయో అని నిరీక్షిస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ ఓ శాంపిల్ చూపించబోతోంది.
[m9ad]
ADVERTISEMENT
మంగళవారం నాడు సాయంత్రం 4.50 గంటలకు ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రోమోను నిర్మాణ సంస్థ విడుదల చేయనుంది. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమా పబ్లిసిటీ అంతా ‘4.50’ లేక ‘8.10’ చుట్టూ తిరుగుతుండడంతో, సినిమాలో ఈ టైమింగ్స్ ప్రాధాన్యత ఏమైనా ఉంటుందేమోనన్న టాక్ వినపడుతోంది.
ADVERTISEMENT



