ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ముందుండి బన్నీకి సన్మానం చేస్తారా?

Chiranjeevi Allu Arjun69 ఏళ్ళ నేషనల్ అవార్డ్స్ లో చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. ఇప్పటివరకూ ఏ తెలుగు నటుడు సంపాదించ లేని ఘనత – ఉత్తమ నటుడి అవార్డు బన్నీ రాబట్టాడు. దీనితో అల్లు కాంపౌండ్ లో సంబరాలు మిన్నంటాయి.

ఇకపోతే అల్లు అర్జున్ కి ఈ అవార్డు రావడం మెగా అభిమానుల్లోనే ఒక సెక్షన్ కి పెద్ద షాక్. వీరు చాలా వరకూ అల్లు అర్జున్ ను తమ వాడిగా చూడరు. సోషల్ మీడియా లో అయితే ఓపెన్ గానే బన్నీ ని తిడుతూ ఉంటారు.

ADVERTISEMENT

పైగా ఈ సారి ఈ అవార్డు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను రాంచరణ్ కు వస్తుందని గట్టిగా నమ్మారు. రామ్ చరణ్ కు రాకపోగా అల్లు అర్జున్ కు రావడం పెద్ద షాక్.

ఫ్యాన్స్ గురించి అటు ఉంచితే చిరంజీవి – అల్లు ఫ్యామిలీ కి కూడా కొంత గ్యాప్ ఉందని పుకారు. రామ్ చరణ్ కు రాకుండా అల్లు అర్జున్ కి రావడం ఒక తండ్రిగా చిరంజీవి కి నిరాశే. కాకపోతే ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి కి ఇంకో బాధ్యత ఉంది – అది ఇండస్ట్రీ తరపున బన్నీ ని సన్మానించాలి.

కాకపోతే మెగా ఫ్యాన్స్ లాగా చిరంజీవి బయటపడరు. అల్లు ఫ్యామిలీ తో గ్యాప్ ఉన్నట్టుగా కనిపించినా ఆ సమయం వచ్చినప్పుడు ఎప్పుడూ చిరంజీవి బయటపడరు. లౌక్యం తో మేనేజ్ చేస్తారు.

అందుకే అవార్డు రాగానే ఒక ట్వీట్ వేసేశారు.

కాకపోతే ఈ సన్మాన కార్యక్రమాన్ని ముందుండి సన్మనించేంత ఉంటుందా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories