ఈ సంక్రాంతికి విడుదలైందో లేదో అప్పుడే “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమాపై స్పూఫ్ డైలాగ్స్ వచ్చేసాయి. తాజాగా విడుదల చేసిన ఓ సినిమా టీజర్ లో ‘సమయం లేదు మిత్రమా… క్యాషా… కార్డా…’ అంటూ నవ్వులు పూయించారు. నవంబర్ 8వ తేదీన మోడీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దు నిర్ణయంపై “ఏటీఎం – నాట్ వర్కింగ్” అనే పేరుతో ఓ తెలుగు చిత్రం నిర్మాణమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ను తాజాగా విడుదల చేసారు.
ఇడ్లీ పాత్ర అడ్డుపెట్టుకుని వేసిన సదరు డైలాగ్ బాగా పేలింది. బాలయ్య సినిమాకు స్పూఫ్ గా ఉన్నప్పటికీ, సీన్ లో సింక్ కావడంతో వీక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. కేవలం ఆ ఒక్క డైలాగ్ తోనే ముగించిన ఈ టీజర్ లో కేవలం రెండు పాత్రలు మాత్రమే కనిపించాయి. షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ, సిల్వర్ స్క్రీన్ కు తక్కువ మాదిరి కనపడుతోన్న ఈ సినిమాకు సునీల్ కుమా రెడ్డి దర్శకత్వం వహించగా, కిషోర్ బాసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మించారు.



