అయోధ్య రామయ్య బీజేపీని తప్పక కాపాడుతాడు

Ayodhya Ram Narendra Modi

సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు అయోధ్యలో రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతుండటం యాదృచ్చికమే కావచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం పేరుతో చాలా హడావుడి చేస్తూ యావత్ దేశ ప్రజల దృష్టిని అయోధ్యపైకి మళ్ళించగలిగింది. కనుక అయోధ్య రామయ్య బీజేపీని మరోసారి లోక్‌సభ ఎన్నికలలో గట్టెక్కిస్తాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ADVERTISEMENT

నిజానికి దేశంలో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయమే లేదు. కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ, అదో పెద్ద కప్పల తక్కెడల మిగిలిపోయింది. కనుక బీజేపీకి ఢోకా లేదనే భావించవచ్చు. అయినప్పటికీ బీజేపీ అధిష్టానం ఏమాత్రం రిస్క్ తీసుకోదలచుకోలేదు.

ఆనాడు అద్వానీ, ఇప్పుడు మోడీ బీజేపీ రధాన్ని ఎవరు నడుపుతున్నా అందరూ ఆ శ్రీరాముడునే నమ్ముకున్నారు. విజయం సాధించారు. కనుక ప్రధాని నరేంద్రమోడీ కూడా అయోధ్య రాముడి సాయం కూడా తీసుకోవడానికి వెనకాడటం లేదు.

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా అయోధ్య రామయ్య దర్శనానికి, అక్కడ జరిగే హడావుడికి ఎన్నికల కోడ్ వర్తింపజేయలేరు. కనుక అయోధ్యలో హడావుడి ఇప్పుడప్పుడే ముగిసేది కాదు…. ముగించనీయదు కూడా!

బీజేపీ అయోధ్య పేరుతో రామబాణం సందిస్తుంటే కాంగ్రెస్‌, ఇండియా కూటమి వద్ద దానికి విరుగుడు బాణం, మంత్రం లేకుండా పోయాయి. రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ఢిల్లీ వరకు భారత్‌ జోడోకి సీక్వెల్ చేస్తున్నప్పటికీ దాని వలన కాంగ్రెస్‌కు పెద్ద ఉపయోగం ఉండక పోవచ్చు. ఇండియా కూటమికి కూడా ఉండకపోవచ్చు.

ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ పట్టు సాధించింది. పంజాబ్, ఢిల్లీలో ఆమాద్మీ అధికారంలో ఉంది కనుక ఆ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్‌ కంటే బీజేపీకి కాస్త ఎక్కువ బలం ఉంది.

ఇక దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ, కర్ణాటకలలో మాత్రమే బలం ఉంది. అయోధ్య ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై పెద్దగా లేకపోయినా అయోధ్య రామయ్యే బిఆర్ఎస్‌, వైసీపి, టిడిపి, జనసేన వంటి ప్రాంతీయ పార్టీల చేత బీజేపీకి మద్దతు ఇప్పించగలడు. కనుక ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ‘జై శ్రీరామ్…’ నినాదం ఒక్కటే బీజేపీకి చాలు.

ADVERTISEMENT
Latest Stories