‘బాహుబలి 2’ పంట పండిందిగా!

Baahubali 2 - 6 Shows Per Dayప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన “బాహుబలి 2” విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. నాలుగు భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా, ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూటర్ల పంట పండించబోతోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ‘ప్రీ అడ్వాన్సు బుకింగ్స్’లో సైతం రికార్డులు నమోదు చేస్తోంది. దీనికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కీలక జీవో వెలువడింది.

ఇప్పటివరకు నాలుగు ఆటలతో ప్రదర్శితమవుతున్న ధియేటర్లలో “బాహుబలి 2” సినిమాకు గానూ, ఆరు షోలకు అనుమతి లభించింది. ఉదయం 7.30 నిముషాలతో ప్రారంభం కాబోయే తొలి ఆట, చివరకు 2.30కి ముగిసే విధంగా షెడ్యూల్స్ ఇచ్చారు. అయితే ఇది సినిమా విడుదలైన 10 రోజుల వరకు మాత్రమే. ఏపీకి చెందిన 13 జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు దాఖలు చేసుకున్న అప్లికేషన్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ADVERTISEMENT

ఇతర సినిమాల విషయంలో ఇది వర్కౌట్ అయినా, కాకున్నా ‘బాహుబలి 2’పై నెలకొన్న అంచనాల రీత్యా ఖచ్చితంగా ఈ ఎత్తుగడ సానుకూల ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. దీంతో మొదటి పది రోజులు మునుపెన్నడూ లేని విధంగా ఏపీలో “బాహుబలి 2” కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా చెప్పవచ్చు. అందులోనూ వచ్చే వారం నుండి స్కూల్స్ సెలవులు కూడా ప్రారంభం కానుండడంతో ‘బాహుబలి 2’ పంట పండబోతోందని చెప్పవచ్చు.

Baahubali 2 - 6 Shows Per Day

ADVERTISEMENT
Latest Stories