ఒక సినిమా హిట్టైన తర్వాత, సదరు సినిమాను వాడుకుంటూ వ్యాపార ఉత్పత్తులు మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుండేవి. ‘పోకిరి’తో ఉధృతమైన ఈ ప్రభంజనం మొన్నటి ‘ఖైదీ నంబర్ 150’ వరకు కొనసాగింది. అయితే తాజాగా ‘బాహుబలి 2’కు మాత్రం విడుదలకు ముందే వ్యాపారస్తులు, ఈ సినిమాను టార్గెట్ చేసినట్లుగా కనపడుతోంది. దీంతో మార్కెట్ లో ఉన్న షాపులలో ‘బాహుబలి 2’ మేనియానే కనపడుతోంది.
‘లేస్’ మాదిరి మంచింగ్ ఫుడ్ ప్యాకేజ్ లకైనా, అలాగే చిన్న పిల్లల బిస్కెట్స్, చాక్లెట్స్ కైనా ‘బాహుబలి 2’దే హవా అంతా! ఆఖరికి బ్రిటానియా, నెస్లే వంటి మల్టీ నేషనల్ కంపెనీలను కూడా ‘బాహుబలి 2’ ఫీవర్ తాకింది. దీంతో సదరు టాప్ కంపెనీలు కూడా తమ సేల్ ప్యాకింగ్ లపై ‘బాహుబలి 2’ పోస్టర్లను ముద్రించి అమ్మకాలు మొదలుపెట్టడం విశేషం. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంటే, విడుదలైన తర్వాత ఉధృతి ఏ రేంజ్ లో ఉంటుందో మరి!
ADVERTISEMENT
ADVERTISEMENT



