‘ప్రభాస్’ సోదరుడికి పడింది ‘బ్యాండ్’

baahubali Prabhas brother pramodh convictedచెక్స్ బౌన్స్ కేసులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సోదరుడు ఉప్పలపాటి ప్రభోద్ కు ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు హైదరాబాద్ రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన “బిల్లా” అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ప్రభోద్, హైదరాబాద్ నగరానికి చెందిన గంగానాతే అనే మహిళా వ్యాపారి వద్ద 43 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు.

ADVERTISEMENT

ఈ అప్పు తీర్చే క్రమంలో 43 లక్షలకు సంబంధించిన ఒక చెక్ ను సదరు వ్యాపారికి ఇచ్చిన ప్రభోద్, ఆ చెక్కును హానర్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో తనకు న్యాయం చేయాల్సిందిగా కోరినప్పటికీ ప్రభోద్ సరిగా స్పందించకపోవడంతో… గంగానాతే 2013లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుండి విచారణ సాగిస్తున్న ఈ కేసులో మంగళవారం నాడు తుది తీర్పు వెలువడింది.

చెక్ బౌన్స్ చేసిన ప్రభోద్ కు ఏడాది జైలు శిక్ష విధించడమే కాకుండా, అప్పుగా తీసుకున్న 43 లక్షల రూపాయలకు గానూ మొత్తం 87 లక్షలు రెండు నెలల్లో చెల్లించాలని రాజేంద్రనగర్ రెండవ ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ సీవీపీఎస్ చార్లెస్ తేర్పు చెప్పారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యంగ్ రెబెల్ స్టార్ అభిమానులు… ఈ ఉదంతంలో ప్రభాస్ జోక్యం చేసుకుని ఉంటే, పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories