ఊరించి ఊరించి తుస్సుమనిపించిన “బాహుబలి”

baahubali towards 500 crores collections‘ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్’గా పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాన్ని ‘యూ ట్యూబ్’లో 4కే టెక్నాలజీలో ఉంచుతామంటూ చిత్ర యూనిట్ అంతా ప్రచారం చేసింది. ఇప్పటికే డివిడి, బ్లూరే ప్రింట్లు విడుదలై ‘డౌన్ లోడింగ్’ల రూపంలో సంచలనం సృష్టించాయి. దీంతో ‘4కే’ టెక్నాలజీలో “బాహుబలి”ని వీక్షిద్దామని ఎదురు చూసిన ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది.

అనుకున్న సమయం సాయంత్రం 6 గంటలకల్లా మూడు భాషల్లో 4కే పరిజ్ఞానంతో “బాహుబలి”ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఇందులో “ట్విస్ట్” ఏమిటంటే, ఈ సినిమాను వీక్షించాలంటే 150 రూపాయలు ‘రెంట్’ రూపేణా చెల్లించి చూడాల్సి ఉంది. కేవలం టీజర్లను మాత్రమే ఉచితంగా వీక్షించే అవకాశం ఉంది. ఊహించని ఈ పరిణామంతో షాక్ కు గురైన ప్రేక్షకులు విమర్శలతో విరుచుకుపడ్డారు.

ఇప్పటికే చాలా మొత్తాన్ని “కలెక్షన్స్” రూపంలో ఇచ్చి ఉన్నామని, ఇంకా ప్రేక్షకుల నుండి ఎంత గుంజుతారని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది యూ ట్యూబ్ లో ఉచితంగా సినిమాను ఉంచాలని కోరుతున్నారు. అయితే వివిధ వెబ్ సైట్ లలో ఇప్పటికే ‘ఆన్ లైన్’లో అందుబాటులో ఉన్న ‘బాహుబలి’ సినిమాకు ‘యూ ట్యూబ్’లో ఇంత డిమాండ్ ఏమిటంటే… ‘4కే’ టెక్నాలజీయే కారణమని చూపరులు చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories