‘డెడికేషన్’లో తేడా చూపించిన నిఖిల్ – బాహుబలి టీం!

Baahubali Haritha Haaram, Baahubali Team Haritha Haaram, Rajamaouli Baahubali Team Haritha Haaram, Rana Baahubali Team Haritha Haaram, Prabhas Baahubali Team Haritha Haaram, చేసేది ఎలాంటి పనైనా పూర్తి నిబద్దతో, చిత్తశుద్ధితో చేయడం విజ్ఞుల లక్షణం. అలాంటి లక్షణాలనే కళ్ళకు కట్టినట్లుగా చూపించారు ‘బాహుబలి’ టీం. తెలంగాణా సర్కార్ ప్రారంభించిన ‘హరితహారం’ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినీ సెలబ్రిటీలు మొక్కలను నాటే కార్యక్రమంలో నిమగ్నమైన విషయం తెలిసిందే. కొందరు ప్రభుత్వ మంత్రుల సమక్షంలో మొక్కలను నాటుతుండగా, మరికొందరు స్వచ్ఛదంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా యువహీరో నిఖిల్ మరియు ‘బాహుబలి’ సినిమా యూనిట్ నాటిన మొక్కల విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కళ్ళజోడు పెట్టుకుని, స్టైలిష్ గా రెడీ అయ్యి, ఓ ముగ్గురికి మొక్కలు నాటే ఛాలెంజ్ ను విసరడం యువహీరో నిఖిల్ వంతు కాగా, మొక్కల కోసం గోతులు త్రవ్వి, ఆ మొక్కలను అందులో పెట్టి, నీళ్ళు పోయడం ‘బాహుబలి’ చిత్ర యూనిట్ చేసింది.

ADVERTISEMENT

అయితే నిఖిల్ రూపొందించిన మొక్కలు నాటే ప్రక్రియ ఒక వీడియో కోసం చేసినట్లు కనపడుతుండగా, ‘బాహుబలి’ టీం మాత్రం మొక్కలు నాటడంలో కూడా తమకున్న చిత్తశుద్ధిని చాటుకుంది. సామాజిక పరమైన ఇలాంటి విషయాలలో చిన్న హీరో – పెద్ద హీరో అన్న తారతమ్యం అన్న తేడా ఉండదు… చేసే పని తప్ప..! బహుశా ఇలాంటి సందర్భంలోనే వారు పెద్దగా ఎందుకు అయ్యారు… వీరు చిన్నగా ఎందుకు ఉన్నారు… అన్న విషయం వీక్షకులకు తెలుస్తుందేమో..!

ADVERTISEMENT
Latest Stories