ఫస్ట్ షాట్ కు అదిరిపోయే స్పందన!

 balakrishna first look in ntr bipic నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ “యన్.టి.ఆర్.” క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రను ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ గురువారం నుండి ప్రారంభమైంది. ఈ విషయాన్ని క్రిష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలకృష్ణ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ ఖరారు చేసారు. ఈ పోస్టర్ లో బాలయ్య ఎంతో యంగ్ గా కనిపించడంతో వీక్షకుల నుండి అదిరిపోయే స్పందనను తెచ్చుకుంది.

ADVERTISEMENT

బాలయ్య ఓ వైపు ఉండగా, మరోవైపు ఎన్టీఆర్ నాడు తన డైరీలో రాసుకున్న ఓ పేజీని ఉంచారు. ‘అభిమానమును మించిన ధనము; ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా బుణపడ్డట్టే!…’ అని 1975వ సంవత్సరంలో ఎన్టీఆర్ తన డైరీలో రాసుకున్న ఓ పేజీని ఈ పోస్టర్ లో ఓ వైపు ఉంచారు. కాగా, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనుంది. ఈ చిత్రాన్ని 2019 జనవరి 9న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories