బాలయ్య ‘ఫోకస్’ చేయాల్సిందే! లేకపోతే కష్టమే!

Balakrishna overseas marketతెలుగు సినిమా ఇండస్ట్రీకి స్థానిక మార్కెట్ ఎంత ప్రాముఖ్యమో, ఓవర్సీస్ మార్కెట్ కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు సినిమాలకు మరో ‘నైజాం’ మాదిరి తయారైన ఈ ఏరియాలో నందమూరి నటసింహం కాస్తంత ‘ఫోకస్’ చేయాల్సిన అవసరముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలలో ఒక్క “డిక్టేటర్” తప్ప మిగిలిన మూడు చిత్రాలు ఓవర్సీస్ లో మంచి వసూళ్లను సాధించాయి.

ఇప్పుడే కాదు, బాలయ్య కెరీర్ లో ఇటీవల కాలంలో సూపర్ హిట్లుగా నిలిచిన “సింహా, లెజెండ్” సినిమాలకు కూడా అంతంత మాత్రపు ఆదరణే లభించింది. బీ, సీ సెంటర్లలో బాల‌య్య సినిమాలకు తిరుగుండదు. బాల‌య్య సినిమాల‌కు ఆంధ్రా, సీడెడ్‌ ప్రాంతాలు బ‌ల‌మైన వ‌సూళ్లను తీసుకువస్తుంటాయి. తెచ్చే ప్రాంతాలు. అయితే నైజాం, ఓవ‌ర్సీస్‌ల‌లో మాత్రం బాల‌య్య త‌న మ్యాజిక్ చూపించ‌లేక‌పోతున్నాడు.

ADVERTISEMENT

“డిక్టేట‌ర్” వ‌సూళ్లు అన్నిచోట్లా బాగానే ఉన్నా, ఈ రెండు చోట్ల మాత్రం బాలకృష్ణ స్థాయిలో లేవని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఓవ‌ర్సీస్‌లో అయితే మ‌రీ ఘోరంగా ఉందని, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి చిన్న సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధిస్తే, బాలయ్య సినిమా కనీసం కోటి రూపాయ‌లు ద‌క్కించుకోవ‌డానికి అప‌సోపాలు ప‌డుతోందని అభిప్రాయ పడుతున్నారు.

ఓవ‌ర్సీస్ లో “నాన్నకు ప్రేమతో” వంటి ‘క్లాస్’ సినిమాలకు ఎక్కువ శాతం పట్టం కట్టినా, మాస్ సినిమాలు కూడా భారీ వ‌సూళ్లను సాధిస్తుంటాయి. కానీ.. బాల‌య్య ‘మ్యాజిక్’ అక్క‌డ ప‌నిచేయ‌డం లేదు. ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల్ని బుట్ట‌లో ప‌డేయ‌డానికి బాల‌య్య తన చిత్రాలకు సరికొత్త హంగులు అద్దాల్సిందే! మరి 100వ సినిమాతో అయినా ఆ లోటును భర్తీ చేస్తారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories