ఘోరంగా ఉన్న నందమూరి ప్రొడ్యూసర్ పరిస్థితి!

Balakrishna producer changala venkata raoin jailఈ ఫోటోలో కటకటాల వెనకున్నది ఎవరో తెలుసా? బాలకృష్ణతో ‘సమరసింహారెడ్డి,’ జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు’ వంటి సూపర్ హిట్ చిత్రం నిర్మించిన నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు. ఇంతకీ అక్కడ ఎందుకున్నాడో తెలుసా? ఓ హత్యకేసులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తూ, అనారోగ్యం బాగాలేక విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలోని ఖైదీలు చికిత్స పొందే విభాగంలో ఉన్నారు.

ADVERTISEMENT

ఇక ఆసుపత్రి తనిఖీ నిమిత్తం వెళ్లిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, చెంగల ఉన్న విభాగానికి వెళ్లి, అక్కడున్న ఖైదీలకు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే పక్కన ఉన్న అధికారులు, ఆయన ప్రముఖ నిర్మాతని, మాజీ ఎమ్మెల్యే అని, యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారట. దీంతో ఆయన ఆశ్చర్య పోయారట.

కాగా, పాయకరావుపేట అసెంబ్లీకి 2004లో ఎమ్మెల్యేగా గెలిచి, ఆపై 2009లో ఓడిపోయిన వెంకట్రావు, 2014లో వైసీపీలో చేరి ఓడిపోయారు. 2007లో నక్కపల్లి ప్రాంతంలో ఓ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన గొడవలో ఓ మత్స్యకారుడు మరణించగా, ఆ కేసులో వెంకట్రావు దోషిగా నిరూపితమై శిక్షనుభవిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories