హిందూ ముస్లిం.. పాకిస్తాన్… బీజేపీ జీహెచ్ఎంసి మంత్రం

bandi sanjay kumar says BJP surgical strike on hyderabad old cityహిందూ ముస్లిం… తెరాస ఎంఐఎం చుట్టూనే తెలంగాణ బీజేపీ జీహెచ్ఎంసి కాంపెయిన్ నడుస్తుంది. ఇప్పటికే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో మతకలహాలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తుండగా… బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం అదే రూట్ లో వెళ్తున్నారు.

ADVERTISEMENT

హబ్సిగూడలోని ఒక రోడ్ షోలో మాట్లాడుతూ… జీహెచ్ఎంసి ఎన్నికల తరువాత పాత బస్తీ పై తాము సర్జికల్ స్ట్రైక్ చెయ్యడం ఖాయమని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. “అక్కడ అనధికారికంగా నివసిస్తున్న రోహింగ్యాలను, పాకిస్తాన్ కొడుకులను తరిమి తరిమి కొడతాం. బీజేపీ బరాబర్ హిందువుల కోసం పోరాడుతుంది,” అని సంజయ్ చెప్పుకొచ్చారు.

హిందూ ముస్లిం కార్డు మీద బీజేపీ చాలా ఆశలే పెట్టుకున్నట్టు ఉంది. గతంలో హిందూ ముస్లిం కార్డు మీద హైదరాబాద్ లో తరచు గొడవలు జరిగేయి. అయితే కొంతకాలంగా హైదరాబాద్ అవేమీ లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ వాటిని తెరమీదకు తెచ్చి రాజకీయంగా బలపడదామని బీజేపీ చూస్తున్నట్టుగా ఉంది.

అయితే ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. 4న ఫలితాలు వస్తాయి. ఒకరకంగా తెలంగాణ ఏర్పడిన తరువాత ఎదురు అనేది లేకుండా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి మొట్టమొదటి సారిగా ఇక్కడ బీజేపీ రూపంలో సవాలు ఎదురయ్యింది అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories