ఎట్టకేలకు పవన్ ను కలిసాడు… సెల్ఫీ వేసేసాడు…!

Bandla Ganesh ith Pawan Kalyan - Katamarayudu Setsతన జీవితం ఇలా ఉందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ మాత్రమేనని, ఒక సినిమా సరిగా ఆడకపోతే మరో సినిమాకు అవకాశం ఇచ్చి, నిర్మాతగా తనకు లైఫ్ నిచ్చాడని, ఇలా రకరకాలుగా పవన్ పై తన అభిప్రాయాలు తెలియజేసే బండ్ల గణేష్, ‘గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత రెండు సంవత్సరాల పాటు పవన్ కు దూరంగా ఉండడం సినీ జనాలను ఆలోచనలో పడేసింది. అయితే త్రివిక్రమ్ చొరవతో మళ్ళీ పవన్ ను కలిసానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన బండ్ల, లేటెస్ట్ గా పవన్ తో ఉన్న ఓ సెల్ఫీని కూడా పోస్ట్ చేసారు.

‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ను కలిసిన నిర్మాత బండ్ల గణేష్, ఏకంగా పవన్ తో ఓ సెల్ఫీనే కొట్టేసాడు. ఇదే కాస్ట్యూమ్ లో నితిన్ తో కూడా ఓ ఫోటో దిగిన పవర్ స్టార్, బండ్ల గణేష్ తో అయితే సెల్ఫీ తో క్లిక్ మనిపించాడు. దీంతో ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై సందడి చేస్తున్నాయి. మార్చి 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘కాటమరాయుడు’ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు వేచిచూస్తున్న తరుణంలో… ఈ తాజా ఫోటోలు అభిమానులకు మంచి ఉత్సాహాన్నిస్తున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories