రాహుల్ గాంధీ చెంతన… పవన్ వీరభక్తుడు..!

Bandla Ganesh- meets Rahul Gandhi‘తన దేవుడు పవన్ కళ్యాణ్’ అంటూ సినీ వేడుకలపైన, ఇంటర్వ్యూలలో కమెడియన్ కం నిర్మాతగా మారిన బండ్ల గణేష్ చేసే ప్రసంగాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈవెంట్ ఏదైనా తన వీరభక్తిని చాటుకునే బండ్ల, తాజాగా రాహుల్ గాంధీతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేనా ‘భవిష్యత్తు అంతా మీదే’ అంటూ ఆశీర్వాదాలు కూడా అందించారు.

‘అమెరికా ప్రెసిడెంట్ తో ఫోటో తీయించుకుని రమ్మంటారా… ఒక్క రోజులో తీసుకొస్తా, ఆ స్థాయి నాది… నన్నెవరూ టచ్ చేయలేరు…’ అంటూ ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంతగా హల్చల్ చేసాయో తెలిసిందే. యుఎస్ ప్రెసిడెంట్ మాట పక్కన పెడితే, తాజాగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. అయితే తన దేవుడు పరోక్షంగా బిజెపికి మద్దతు పలుకుతుంటే, మరి భక్తుడు కాంగ్రెస్ ఎలా మద్దతు పలుకుతున్నారు?

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories